హైదరాబాద్ పాతబస్తీలోని ఉప్పుగూడ కాళీమాత ఆలయ భుముల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయానికి చెందిన 7 ఎకరాల భూమిలో ప్రహరీ గోడ నిర్మించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రహరీగోడను కూల్చి ఆందోళనకు దిగారు. అయితే.. స్థానికుల్ని పోలీసులను అరెస్టు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అంతలో ఎమ్మెల్యే రాజా సింగ్ కాళీమాత ఆలయం వద్దకు చేరుకుని పోలీసులతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అక్కిడికి చేరుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.