Vangalapudi Anitha : వైసీపీ నేతలు కాలకేయుల్లా మహిళలపై అఘాయిత్యాలు చేస్తున్నారు : వంగలపూడి అనిత
Vangalapudi Anitha : వైసీపీ నేతలు కాలకేయుల్లా మారి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత.;
Vangalapudi Anitha : వైసీపీ నేతలు కాలకేయుల్లా మారి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. మచిలీపట్నం వీఓఏ నాగలక్ష్మిది కచ్చితంగా ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. ఈ ఘటనపై సీఎం జగన్‌కు వంగలపూడి అనిత బహిరంగలేఖ రాశారు.
వైసీపీ నేత గరికపాటి నరసింహారావు వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు అనిత. ఈ మూడేళ్లలో మహిళలపై 1500లకు పైగా అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగితే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. దిశా చట్టం కింద ఒక్క నేరస్థుడికైనా శిక్ష విధించారా అని నిలదీశారు.
ఆడబిడ్డలపై వరుస అఘాయిత్యాలకు ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణమన్నారు. ఆడబిడ్డలు అన్యాయమైపోతుంటే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మహిళా హోంమంత్రి ఉండి కూడా ఏపీలో మహిళలకు రక్షణ లేకపోవడం బాధాకరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు వంగలపూడి అనిత.