vangaveeti Radha : నన్ను చంపడానికి రెక్కీ.. వంగవీటి రాధా సంచలన ఆరోపణలు..!

vangaveeti Radha : కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన వంగవీటి రంగ వర్ధంతి సభలో సంచలన ఆరోపణలు చేశారు వంగవీటి రాధా.;

Update: 2021-12-26 10:46 GMT

vangaveeti Radha : కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన వంగవీటి రంగ వర్ధంతి సభలో సంచలన ఆరోపణలు చేశారు వంగవీటి రాధా. తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని ఆయన ఆరోపించారు. రంగా కీర్తి, ఆశయ సాధనే తన లక్ష్యమన్న రాధా.. పదవులపై ఎలాంటి ఆశ లేదన్నారు. తనను ఏదో చేద్దామని రెక్కీ నిర్వహించారని.. నేను దానికి భయపడనని.. అన్నిటికీ నేను సిద్ధమే అని వంగవీటి రాధా అన్నారు. తనను పొట్టన పెట్టుకోలని అనుకునేవారికి ఎప్పటికీ భయపడనన్న రాధా.. ఎప్పుడు ప్రజల మధ్యే ఉంటానన్నారు.

Tags:    

Similar News