మృతురాలి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి: వర్ల రామయ్య
ఏపీలో అరాచక, అప్రజాస్వామిక పాలన సాగుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు.;
ఏపీలో అరాచక, అప్రజాస్వామిక పాలన సాగుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. దళిత యువతి హత్యకు గురైతే సీఎం స్పందించరా? అని ప్రశ్నించారు. మృతురాలి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శిస్తే తప్పా? అని అన్నారు. వైసీపీ నేతల్ని వదిలేసి, టీడీపీ నేతల్ని అరెస్టు చేయడం దారుణమని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. నక్కా ఆనంద్ బాబును ఎస్పీ లాగి చెంపపై కొట్టారని వర్ల రామయ్య తెలిపారు. ఎస్పీ కొట్టింది... నక్కా ఆనంద్‌బాబును మాత్రమే కాదని, దళిత జాతిపై దాడి అని అభివర్ణించారు.