అసభ్యకర పోస్టుల కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని కడప కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. ఆయనతో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్‌లను కూడా కోర్టు ముందు హాజరుపర్చారు. సీకేదిన్నె పోలీస్ స్టేషన్‌లో విచారణ తర్వాత ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి కడప కోర్టులో ప్రవేశపెట్టారు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితలపై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో వర్రా రవీంద్రను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈనెల 8న కర్నూలు సమీపంలో వర్రా రవీంద్రను అరెస్ట్ చేశారు పోలీసులు.