270వ రోజుకు చేరుకున్న అమరావతి ఉద్యమం
అమరావతి సాధించేవరకు పోరాటాన్ని ఆపేది లేదంటున్నారు వెంకటపాలెం రైతులు;
అమరావతి ఉద్యమం 270వ రోజుకు చేరుకుంది. వెంకటపాలెం మహిళా రైతులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. అమరావతి ఉద్యమంలో అందర్నీ భాగస్వామ్యం చేసేందుకు.. ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి పిలిచారు. అందరూ భాగస్వామ్యం అయితే.. ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లవచ్చంటున్నారు. అమరావతి సాధించేవరకు పోరాటాన్ని ఆపేది లేదంటున్నారు వెంకటపాలెం రైతులు.