Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం గుడ్ న్యూస్.. రూ.17వేల కోట్ల ప్యాకేజీ

Update: 2025-01-17 10:00 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్‌కే కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్‌ ప్లాంట్‌కు 17 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనుంది. ఆర్థిక ప్యాకేజీని అధికారికంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కార్యాలయం ప్రకటించింది. ఇటీవల ప్రధాని మోడీని కలిసిన సందర్భంలో.. ప్యాకేజీ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News