ఆరుగురిని నరికి చంపిన అప్పలరాజుకు విశాఖ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2021 ఏప్రిల్ 15న విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అప్పలరాజు హతమార్చాడు. జుత్తాడలోని బత్తిన, బొమ్మిడి కుటుంబాల మధ్య వివాదాలున్నాయి. ఈ క్రమంలో బొమ్మిడి కుటుంబం ఇంట్లోకి చొరబడిన అప్పలరాజు ఆరుగురిపై కత్తితో దాడి చేశారు. దొరికిన వారిని దొరికినట్టు నరికిపారేశాడు.ఈ కేసులో నేర నిరూపణ కావడంతో అప్పలరాజుకు ఉరిశిక్ష విధించారు. కుటుంబ పెద్ద అయిన బమ్మిడి రమణ , ఆ కుటుంబంలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లల్ని చంపేశాడు. పిల్లలలో ఐదు నెలల పసిపాప కూడా ఉంది. గడ్డి కోసే రెండు పదునైన కొడవలితో హత్య చేశాడు. ఈ కేసులో అప్పలరాజుకు కోర్టు ఉరి శిక్ష విధించింది.