VISHKHA: గ్లోబల్ డిజిటల్ గేట్‌వేగా విశాఖ

గ్లోబల్ డిజిటల్ గేట్‌వేగా విశాఖ... భారీ ప్రాజెక్టుకు నారా లోకేశ్ శంకుస్థాపన... డిజిటల్ రంగంలో కీలక ముందడుగు...ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన .. రూ.1500 కోట్ల డేటా సెంటర్ అభివృద్ధి

Update: 2025-10-13 04:00 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో టె­క్నా­ల­జీ హబ్‌­గా ఎదు­గు­తు­న్న వి­శా­ఖ­ప­ట్నం గ్లో­బ­ల్ డి­జి­ట­ల్ ప్ర­పం­చం­లో తన స్థా­నా­న్ని సు­స్థి­రం చే­సు­కు­నే ది­శ­గా కీలక అడు­గు వే­సిం­ది. నగ­రం­లో తొలి ఆర్టి­ఫి­షి­య­ల్ ఇం­టె­లి­జె­న్స్ (ఏఐ) ఆధా­రిత ఎడ్జ్‌ డేటా సెం­ట­ర్‌­తో పాటు, ఓపె­న్‌ కే­బు­ల్‌ ల్యాం­డిం­గ్‌ స్టే­ష­న్‌ ఏర్పా­టు­కు రా­ష్ట్ర ఐటీ, ఎల­క్ట్రా­ని­క్స్ శాఖ మం­త్రి నారా లో­కే­శ్ తా­జా­గా శం­కు­స్థా­పన చే­శా­రు. నా­స్‌­డా­క్‌­లో నమో­దైన ప్ర­ముఖ డి­జి­ట­ల్‌ ఐటీ సొ­ల్యూ­ష­న్స్‌ ప్రొ­వై­డ­ర్‌ సిఫీ టె­క్నా­ల­జీ­స్‌ అను­బంధ సం­స్థ సిఫీ ఇన్ఫి­ని­ట్‌ స్పే­సె­స్‌ లి­మి­టె­డ్‌ 50 మె­గా­వా­ట్ల ఏఐ ఆధా­రిత ఎడ్జ్‌ డేటా సెం­ట­ర్‌­తో పాటు ఓపె­న్‌ కే­బు­ల్‌ ల్యాం­డిం­గ్‌ స్టే­ష­న్‌ ఏర్పా­టు చే­స్తోం­ది. రూ.1,500 కో­ట్ల పె­ట్టు­బ­డి­తో రెం­డు దశ­ల్లో డేటా సెం­ట­ర్‌­ను సిఫీ అభి­వృ­ద్ధి చే­య­నుం­ది. దీ­ని­లో వె­య్యి మం­ది­కి ఉపా­ధి లభిం­చ­నుం­ది. ఈ ఏఐ ఆధా­రిత డేటా సెం­ట­ర్‌ ఏర్పా­టు­తో గ్లో­బ­ల్‌ డి­జి­ట­ల్‌ గే­ట్‌­వే­గా వి­శాఖ మా­ర­నుం­ది. ఐటీ సొ­ల్యూ­ష­న్స్ సం­స్థ సిఫీ టె­క్నా­ల­జీ­స్, దాని అను­బంధ సం­స్థ అయిన సిఫీ ఇన్ఫి­ని­ట్‌ స్పే­సె­స్‌ లి­మి­టె­డ్‌ ఆధ్వ­ర్యం­లో 50 మె­గా­వా­ట్ల సా­మ­ర్థ్యం­తో ఈ అత్యా­ధు­నిక డేటా సెం­ట­ర్‌­ను ని­ర్మిం­చ­ను­న్నా­రు. కే­వ­లం డేటా సెం­ట­రే కా­కుం­డా, ఓపె­న్‌ కే­బు­ల్‌ ల్యాం­డిం­గ్‌ స్టే­ష­న్‌­ను కూడా ఇక్కడ ఏర్పా­టు చే­స్తుం­డ­టం వి­శే­షం.


 రూ.1500 కోట్ల పెట్టుబడి అభివృద్ధి

ఈ ప్రా­జె­క్టు కోసం సిఫీ సం­స్థ రెం­డు దశ­ల్లో సు­మా­రు రూ.1,500 కో­ట్ల భారీ పె­ట్టు­బ­డి పె­ట్ట­నుం­ది. ఈ కేం­ద్రం పూ­ర్తి­స్థా­యి­లో కా­ర్య­క­లా­పా­లు ప్రా­రం­భిం­చిన తర్వాత, దా­దా­పు వె­య్యి మం­ది­కి ప్ర­త్య­క్షం­గా ఉపా­ధి లభిం­చ­నుం­ద­ని అం­చ­నా. ఈ ఏఐ ఆధా­రిత డేటా సెం­ట­ర్‌ ఏర్పా­టు­తో వి­శాఖ నగరం అం­త­ర్జా­తీ­యం­గా ఒక కీ­ల­క­మైన డి­జి­ట­ల్ గే­ట్‌­వే­గా మా­ర­నుం­ద­ని, ఇది రా­ష్ట్ర ఐటీ రంగ అభి­వృ­ద్ధి­కి మరింత ఊత­మి­స్తుం­ద­ని ని­పు­ణు­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. ఈ కే­బు­ల్ ల్యాం­డిం­గ్ స్టే­ష­న్ ద్వా­రా భా­ర­త­దే­శం, సిం­గ­పూ­ర్, మలే­షి­యా, ఆస్ట్రే­లి­యా, థా­య్‌­లాం­డ్ దే­శాల మధ్య వే­గ­వం­త­మైన డేటా కనె­క్టి­వి­టీ ఏర్ప­డ­నుం­ది. వి­శా­ఖ­ను దే­శం­లో­నే అతి­పె­ద్ద ఐటీ హబ్‌­గా తీ­ర్చి­ది­ద్దా­ల­న్న­దే ప్ర­భు­త్వ లక్ష్యం. 5 లక్షల ఐటీ ఉద్యో­గాల సృ­ష్టి లక్ష్యం­గా ప్ర­భు­త్వం వి­శా­ఖ­లో ఐటీ మౌ­లిక సదు­పా­యాల అభి­వృ­ద్ధి­ని వే­గ­వం­తం చే­స్తోం­ది. నూతన కే­బు­ల్ ల్యాం­డిం­గ్ స్టే­ష­న్ సదు­పా­యం­వ­ల్ల సము­ద్ర­పు కే­బు­ల్ కనె­క్టి­వి­టీ­ని మె­రు­గు­ప­రు­స్తూ.. ఎడ్జ్ స్థా­యి­లో ఏఐ కం­ప్యూ­టిం­గ్ సా­మ­ర్థ్యా­న్ని వి­స్త­రిం­చే అవ­కా­శం కల్పి­స్తుం­ది. భా­ర­త­దే­శం­తో­పా­టు ఆగ్నే­యా­సి­యా­లో­ని సిం­గ­పూ­ర్, మలే­షి­యా, ఆస్ట్రే­లి­యా, థా­య్లాం­డ్ వంటి దే­శాల మధ్య త్వ­రి­త­గ­తిన డేటా ప్రా­సె­సిం­గ్ చే­స్తూ వి­శాఖ సీ­ఎ­ల్ఎ­స్ వ్యూ­హా­త్మక ల్యాం­డిం­గ్ పా­యిం­ట్‌­గా పని­చే­స్తుం­ది.

మరో ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ

వి­శా­ఖ­ప­ట్నం­కు మరో ప్ర­తి­ష్ఠా­త్మక ఐటీ సం­స్థ రా­బో­తోం­ది. గూ­గు­ల్‌ అను­బంధ సం­స్థ రై­డె­న్‌ ఇన్ఫో­టె­క్‌ ఇం­డి­యా ప్రై­వే­ట్‌ లి­మి­టె­డ్‌ రూ.87,250 కో­ట్ల పె­ట్టు­బ­డు­ల­తో 1,000 మె­గా­వా­ట్ల ఏఐ పవ­ర్‌ డేటా సెం­ట­ర్‌ ఏర్పా­టు చే­సేం­దు­కు ముం­దు­కొ­చ్చిం­ది. రెం­డు­న్న­రే­ళ్ల­లో మొ­ద­టి దశ యూ­ని­ట్‌­ను పూ­ర్తి చే­య­ను­న్న­ట్లు ప్ర­భు­త్వా­ని­కి ప్ర­తి­పా­ద­న­ల­ను అం­దిం­చిం­ది. ఇం­దు­కు రా­ష్ట్ర మం­త్రి­వ­ర్గం తా­జా­గా ఆమో­దం తె­లి­పిం­ది. వి­శా­ఖ­ప­ట్నం-అన­కా­ప­ల్లి ప్రాం­తం­లో­ని తర్లు­వాడ, అడ­వి­వ­రం, రాం­బి­ల్లి­ల­లో మూడు అతి­పె­ద్ద డేటా సెం­ట­ర్లు రా­ను­న్నా­యి. ఈ మూడు క్యాం­ప­స్‌ల కోసం దా­దా­పు 500 ఎక­రాల భూ­మి­ని గు­ర్తిం­చా­రు. అక్టో­బ­ర్ 14న న్యూ­ఢి­ల్లీ­లో ఈ ప్రా­జె­క్ట్ కోసం అధి­కా­రిక ఒప్పం­దం­పై సం­త­కం చే­య­ను­న్నా­రు. ఇది భా­ర­త­దే­శం­లో­నే అతి పె­ద్ద డేటా సెం­ట­ర్‌­ల­లో ఒక­టి­గా ని­ల­వ­నుం­ద­ని అం­టు­న్నా­రు. అదా­నీ, గూ­గు­ల్‌ అను­బంధ సం­స్థ రై­డె­న్‌, సి­ఫీ­తో పాటు టీ­సీ­ఎ­స్‌ కూడా డేటా సెం­ట­ర్‌ ఏర్పా­టు­కు ముం­దు­కు వస్తుం­డ­టం­తో డేటా సెం­ట­ర్ల హబ్‌­గా వి­శాఖ మా­రు­తోం­ది. ఆసి­యా­లో­నే అతి­పె­ద్ద డేటా సెం­ట­ర్‌ కేం­ద్రం­గా అవ­త­రి­స్తోం­ది. గూ­గు­ల్‌ అను­బంధ సం­స్థ రై­డె­న్‌­కు భూ­ముల కే­టా­యిం­పు­న­కు శు­క్ర­వా­రం నాటి క్యా­బి­నె­ట్‌ సమా­వే­శం ఆమో­దిం­చిం­ది. ఈనెల 14వ తే­దీన ఢి­ల్లీ­లో కేం­ద్ర మం­త్రి అశ్వి­నీ వై­ష్ణ­వ్‌, చం­ద్ర­బా­బు, రా­ష్ట్ర ఐటీ శాఖ మం­త్రి లో­కే­శ్‌ సమ­క్షం­లో రై­డె­న్‌ అధి­కా­రిక ప్ర­క­టన చే­య­నుం­ది.

Tags:    

Similar News