VIVEKA CASE: ఆరేళ్లుగా న్యాయం కోసం తిరుగుతున్నా
వైఎస్ వివేకా కుమార్తె సునీత కీలక వ్యాఖ్యలు.. సాక్ష్యులను బెదిరిస్తున్నారు;
వివేక హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను కూడా ఒక సాక్షినే అని.. తనపైన తన భర్త పైన మేమే వివేకాను చంపించామని కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడప ఎస్పీ ని కలిసిన సునీత.. వివేకా హత్య కేసుపై చర్చించారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై యాక్షన్ తీసుకోవాలని పోలీసులు కోరామని తెలిపారు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే అన్నారు. వివేక హత్య కేసు తాజా పరిణామాలను ఎస్పీకి వివరించారు. సుప్రీం లో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ దృష్ట్యా ఎస్పీని కలిసినట్లు తెలిపారు. రెండు రోజులుగా పులివెందులలో ఘటనలు చూస్తే నాన్న హత్య గుర్తొస్తోంది అన్నారు. గొడ్డలి పోటుతో వివేకపడి ఉంటే గుండెపోటు అని చెప్పారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీను తుడిచేశారని ఆరోపించారు. హత్య తర్వాత లెటర్ తెచ్చి ముగ్గురు చంపినట్లు సంతకం పెట్టమంటే నేను పెట్టలేదు అన్నారు. ‘‘జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా రెండు రోజులుగా పులివెందులలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మా నాన్న వివేకా హత్య గుర్తొస్తోంది. గొడ్డలిపోటుతో వివేకా పడి ఉంటే అప్పుడు గుండెపోటు అని చెప్పారు." అని సునీత అన్నారు .
లేఖపై సంతకం పెట్టమన్నారు
ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చంపినట్లు సంతకం పెట్టమన్నారని తెలిపారు. అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారని ఆరోపించారు. ప్రస్తుతం ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుందన్నారు. గతంలో టిడిపి నేతలు చంపారని నమ్మబలికారు అని తెలిపారు. మా బంధువు సురేష్ పై అవినాష్ అనుచరులు దాడి చేయించారని అనుమానంగా ఉందన్నారు. ఆరేళ్లుగా వివేక హత్య కేసు పై పోరాడుతూనే ఉన్నానని తెలిపారు. ఇప్పటివరకు హత్య కేసు దోషులకు శిక్ష పడలేదన్నారు. వివేకాను నేను నా భర్త చంపించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాన్న మళ్ళీ తిరిగి రాడు తప్పు చేసిన వారికి శిక్ష పడాలని ఆమె అన్నారు. వివేక హత్య కేసును నిందితులు బయట తిరు గుతున్నారని సునీత అన్నారు. రేపు వివేక పుట్టినరోజు పులివెందుల వెళ్లొద్దని నా తల్లి చెబుతుందని తెలిపారు. న్యాయం కోసం పోరాడడానికి సెక్యూరిటీని పెట్టుకుని తిరగాల్సి వస్తుంది అన్నారు. కచ్చితంగా న్యాయమే గెలుస్తుందని ఆమె అ న్నారు. బెదిరిస్తే భయపడే పరిస్థితి లేదని తెలిపారు. వివేక హత్య కేసు నిందితులు సాక్షులను బెదిరిస్తున్న దిక్కు లేదని తెలిపారు.