VJA: విజయవాడలో 27 మంది మావోయిస్టుల అరెస్ట్
మావోలు రెక్కీ నిర్వహించారన్న అనుమానం... మావోలను అదుపులోకి తీసుకున్న కేంద్ర బలగాలు
విజయవాడలోని ఆటోనగర్‌లో భద్రతా బలగాల తనిఖీలు కొనసాగుతున్నాయి. మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందుకున్న ఆక్టోపస్ బలగాలు ఆ భవనాన్ని చుట్టుముట్టాయి. 27 మంది మావోలను అరెస్ట్ చేసి భారీగా డంప్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆపరేషన్ కగార్‌తో నక్సలైట్లు మకాం మార్చినట్టు తెలుస్తోంది.
మకాం మార్చిన
కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో నక్సలైట్లు మకాం మార్చినట్టు తెలుస్తోంది. ఆటో నగర్లో మావోలు ఓ భవనాన్ని షెల్టర్ జోన్‌గా మార్చుకుని మహిళ ఆధ్వర్యంలో ఉంటున్నట్టు సమాచారం. అల్లూరి జిలాలో ఈరోజు జరిగిన ఎన్‌కౌంటర్ స్పాట్లో లభ్యమైన డైరీలో మావోల సమాచారం ఉంది. దీంతో ఆక్టోపస్ బలగాలు భవనాన్ని చుట్టు ముట్టి 27మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 26 మంది మావోల్లో 21 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు.విజయవాడ ఆటోనగర్లో మావోలు ఉన్న భవనాన్ని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. కూలీలమని చెప్పి మావోలు అద్దెకు దిగినట్టు సమాచారం. ఈ భవనంలో భారీగా డంప్ స్వాధీనం చేసుకున్నారు. ఏకే 47, డిటోనేటర్ సహా పేలుడు పదార్థాలు గుర్తించారు. మావోలు అందరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారిగా గుర్తించారు. వీరు హిడ్మా దళమని ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ వెల్లడించారు. పరారిలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.
అగ్రనేతను హతమార్చేందుకే...
విజయవాడలో 27 మంది మావోయిస్టులను ఆక్టోపస్ టీం గుర్తించిన సంగతి తెలిసిందే. అయితే వారు విజయవాడలో ఓ అగ్రనేతను హతమార్చేందుకు వచ్చినట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆ అగ్రనేత ఎవరు అనేది చర్చనీయంగా మారింది. మావోయిస్టులు బస చేసిన చోట దొరికన డైరీలో ఈ వివరాలు ఉన్నట్లు సమాచారం. వీరందరూ.. గెరిల్లా యుద్ధ విద్యలో ఆరితేరిన వారే కావడం విశేషం. చాలామంది హిడ్మా దళానికి చెందిన వారే ఉన్నారు.