VJA: గ్రేటర్‌ విజయవాడపై నేడు కీలక నిర్ణయం

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం...7 మండలాలు, 50కిపైగా గ్రామాలు విలీనం?

Update: 2025-12-27 04:00 GMT

గ్రేటర్‌ విజయవాడ వ్యవహారం చివరి దశకు చేరింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. గ్రేటర్‌ విజయవాడలో కొండపల్లి, తాడిగడప మునిసిపాలిటీలను పక్కన పెడితే.. మిగిలినవన్నీ పంచాయితీలే. కాబట్టి ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ఇవ్వటానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే అంశంపై చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మరో నగరానికి గ్రేటర్ హోదా కల్పించే అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే తిరుపతికి గ్రేటర్ హోదా కల్పించే దిశగా అడులు పడుతుంటే.. తాజాగా గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేయాలనే రిక్వెస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు చేరింది. గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనలపై ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సీఎంను కలిశారు. గ్రేటర్ విజయవాడ ఏర్పాటు ప్రాధాన్యం.. ప్రతిపాదనలకు సంబంధించిన నివేదికను చంద్రబాబుకు సమర్పించారు. విజయవాడవాసుల ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చాలని కోరారు. ఇప్పటికే గన్నవరం, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని 75 గ్రామాల్లో నగరంలో అనధికారికంగా కలిసిపోయాయని గుర్తు చేశారు.

మరో గ్రేటర్ నగరానికి అంకురార్పణ

గ్రేటర్ విజయవాడ ఏర్పాటు ప్రాధాన్యం.. ప్రతిపాదనలకు సంబంధించిన నివేదికను చంద్రబాబుకు సమర్పించారు. ఇప్పటికే గన్నవరం, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని 75 గ్రామాలు నగరంలో అనధికారికంగా కలిసిపోయాయి. ఈ గ్రామాలను అధికారికంగా గ్రేటర్ విజయవాడలో చేర్చడం వల్ల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని స్థానిక MLA. MPలు అభిప్రాయపడ్డారు. కృష్ణాజిల్లాలోని గన్నవరం మండలం, ఉంగుటూరు మండలం, విజయవాడ రూరల్‌ మండలం, కంకిపాడు మండలం, పెనమలూరు మండలం, ఎన్టీఆర్‌ జిల్లాలోని జి.కొండూరు మండలం, ఇబ్రహీంపట్నం మండలాల్లోని గ్రామాలను విలీనం చేయాలనే ప్రతిపాదించారు.  

గా దీర్ఘకాలంగా గ్రేట‌ర్ విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఏర్పాటు పెండింగ్‌ లో వుంది. నగర పరిసరాల్లోని 74 గ్రామాలు విలీనమై గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ఏర్పాటు జరగాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఇది జరిగితే పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లు, పర్యాటక పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం లభించి, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగనున్నాయి. దీంతో పాటు సమగ్ర నీటి సరఫరా, వరద నియంత్రణ చర్యలు సమర్థవంతంగా అమ‌లు చేయ‌టానికి వీలు కలుగుతుందనేది అధికారుల వాదన.

Tags:    

Similar News