తమిళనాడు, ఏపీ మధ్య వార్!

ఏపీ, తమిళనాడు అధికారుల మధ్య వార్ నడుస్తోంది. రెండు రాష్ట్రాల మోటార్‌ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు.. ఆర్టీసీ బస్సులను సీజ్‌ చేసుకుంటున్నారు.

Update: 2021-01-15 15:45 GMT

ఏపీ, తమిళనాడు అధికారుల మధ్య వార్ నడుస్తోంది. రెండు రాష్ట్రాల మోటార్‌ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు.. ఆర్టీసీ బస్సులను సీజ్‌ చేసుకుంటున్నారు. నిన్న తమిళనాడులోని వేలూరులో ఏపీఎస్‌ ఆర్టీసీకి చెందిన బస్సులను తమిళనాడు అధికారులు సీజ్ చేశారు. నాలుగు బస్సులకు పర్మిట్లు, రికార్డులు సక్రమంగా లేవంటూ సీజ్ చేశారు.

దీంతో ఇవాళ తమిళనాడు ఆర్టీసీ బస్సులపై ఏపీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరులో తిరుగుతున్న తమిళనాడు ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులను ఎంవీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. సరైన రికార్డులు, పర్మిట్లు లేని ఆరు తమిళనాడు ఆర్టీసీ బస్సులు, రెండు ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు.

పలమనేరులోనూ రెండు తమిళనాడు ఆర్టీసీ బస్సులను కూడా ఇలాగే సీజ్ చేశారు. తమిళనాడు ఆర్టీసీ బస్సుల రికార్డులను పక్కాగా పరిశీలిస్తున్నారు ఎంవీఐ అధికారులు. ఏ ఒక్క రికార్డు లేకపోయినా వాహనాలను సీజ్ చేస్తామని పలమనేరు ఎంవీఐ అధికారులు తేల్చి చెబుతున్నారు. మొత్తానికి, ఆర్టీసీ బస్సులను సీజ్‌ చేయడంలో రెండు రాష్ట్రాల అధికారులు పోటీపోటీగా వెళ్తున్నారు.

Tags:    

Similar News