West Godavari: మద్యం బాటిళ్లలో నీళ్లు.. ప్రభుత్వ దుకాణంలో గోల్‌మాల్..
West Godavari: పశ్చిమగోదావరి ఉండి సెంటర్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణంపై ఎక్సైజ్, విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు;
West Godavari: జనం అడిగిన బ్రాండ్ ఇవ్వరు.. ఇచ్చిందే తీసుకోవాలంటారు.. చిల్లర ఇచ్చే అలవాటు అసలే లేదు.. చివరకు తాగే మందైనా ఒరిజినలా అంటే డౌటే.. అందులో కెమికల్స్ కలుపుతారో, మందు బదులు నీళ్లు కలుపుతారో కూడా అర్థం కాదు.. ఏపీలో సర్కారీ మద్యం దుకాణాల్లో అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి.. సర్కారు మద్యం దుకాణాల్లోనే కల్తీ వ్యాపారం మందుబాబుల జేబులకు చిల్లు పెడుతోంది..
పశ్చిమగోదావరి జిల్లా ఉండి సెంటర్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణంపై ఎక్సైజ్, విజిలెన్స్ అధికారులు దాడులు చేయడంతో ఈ కల్తీ వ్యవహారం బట్టబయలైంది. ఉండిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో ఎక్సైజ్ విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు.. సోదాల్లో మలబార్ హౌస్ హెచ్‌డీ ఫుల్ బాటిల్స్‌ను పరిశీలించిన అధికారులకు అందులో నీరు కలిపినట్లుగా తేలింది.. అంతేకాదు, మఫ్టీలో వచ్చిన అధికారులు అక్కడ జరుగుతున్న మోసాలను ప్రత్యక్షంగా చూశారు.
ఈ కల్తీలో స్థానిక ఎక్సైజ్ ఎస్సైతోపాటు పలువురు వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి.. అంతేకాదు, ఈ మద్యం దుకాణంలో నిర్వాహకులదే ఇష్టారాజ్యమని మందుబాబులు వాపోతున్నారు.. అడిగిన బ్రాండ్ ఇవ్వకుండా ఇచ్చిన బ్రాండ్ తీసుకోవాలని లేదంటే వెళ్లిపోవాలని ఆంక్షలు పెడుతున్నారని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానంలో సూపర్‌వైజర్లు, ఎక్సైజ్ అదికారులు, సేల్స్‌మెన్లే లబ్ధిపొందుతున్నారని.. ఈ విధానాన్ని రద్దు చేయాలని మందుబాబులు కోరుతున్నారు.