Konaseema : ఎవరి బంగారం వారికిస్తా.. కోనసీమ వడ్డీ వ్యాపారి సెల్ఫీ వీడియో

Update: 2025-03-24 11:00 GMT

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కనిపించకుండా పోయిన సత్య సూర్య బ్యాంకర్స్ వడ్డీ వ్యాపార సంస్థ నిర్వాహకుడు కూర్మదాసు హేమంత్ ఎట్టకేలకు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఫిబ్రవరి నుంచి షాపు మూసివేసి కనిపించకుండా పోవడంతో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టిన పలువురు ఇటీవల ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా ఆదివారం హేమంత్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ప్రాణ భయంతో పారిపోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ నాలుగు రోజుల్లో కొత్తపేటకు వస్తానని ప్రతీ ఒక్కరి బంగారాన్ని తిరిగి ఇచ్చేస్తానని వీడియోలో హేమంత్ తెలిపాడు. తనతో పాటు మిగిలిన ఇద్దరు పార్ట్ నర్స్ దగ్గర అందరి వస్తువులు ఉన్నాయని... బంగారు వస్తువులు ఎవరివి కూడా కరిగించలేదని తెలిపాడు. నాలుగు రోజుల్లో పోలీసుల సమక్షంలో అన్ని వివరాలు చెబుతానని వీడియోలో హేమంత్ పేర్కొన్నాడు.

Tags:    

Similar News