మాజీ సీఎం జగన్ తో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు చాలా రోజుల తర్వాత నిన్న అసెంబ్లీకి వచ్చారు. కనీసం ఇప్పుడైనా అసెంబ్లీలో ఉంటారేమో.. మాట్లాడుతారేమో అని అంతా అనుకున్నారు. కానీ అలా జరగనే లేదు. వచ్చిన 11 నిముషాలకే వెళ్లిపోయారు. 11వ తేదీన 11 నిముషాలకే 11 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జగన్ కు 11 మీద ఇదేం ప్రేమ అని ప్రశ్నిస్తున్నారు. కొందరు. అయితే జగన్ తో పాటు మిగతా పది మంది ఎమ్మెల్యేలు సభక్ఉ హాజరయిన కొద్ది సేపటికే గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు. కొన్ని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. తిరుపతి లడ్డూ ఇష్యూ మీద, పీపీపీ విధానం మీద, రాష్ట్రంలో అశాంతి నెలకొన్నదని నినాదాలు చేశారు.
అయితే అదే ప్లకార్డులు పట్టుకుని బయటకు వెళ్లిపోయారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎంతో మర్యాదగా వారికి చెప్పారు. మీరు ఏ ప్రశ్న అయినా అడగండి మంత్రులతో నేను చెప్పిస్తా అని హామీ ఇచ్చారు. మీ గౌరవానికి ఎలాంటి భంగం రానివ్వబోమని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయినా సరే జగన్ తన ఎమ్మెల్యేలను వెంటపెట్టుకుని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. కేవలం ప్లకార్డులు పట్టుకుని ఇలా నినాదాలు చేయడమేనా.. అదే అసెంబ్లీలో కూర్చుని అవే ఇష్యూల మీద మాట్లాడితే కాస్త గౌరవంగా ఉండేదేమో అంటున్నారు నెటిజన్లు.
అలా చేయకుండా కేవలం ప్లకార్డులు పట్టుకుని వెళ్లిపోవడం అంటే.. వైసీపీ లేవనెత్తిన అంశాలపై వారికే నమ్మకం లేనట్టే అనిపిస్తోంది ఇక్కడ. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వారు ఎవరైనా అసెంబ్లీ సమావేశాల్లో కీలక సమస్యలపై చర్చించాలని అనుకుంటారు. ప్రభుత్వాన్ని నిలదీయాలని చూస్తారు. కానీ వైసీపీ మాత్రం బయట ఎన్నో మాట్లాడుతోంది కానీ.. అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం సైలెంట్ గా వెళ్లిపోతోంది. దీన్ని బట్టి వాళ్ల వాదనలో పస లేదని తేలిపోతోంది.