గుంటూరు జిల్లా తెనాలిలో ఓ ఓటరు ఏకంగా వైసీపీ అభ్యర్థి శివకుమార్ చెంప చెల్లుమనిపించాడు. క్యూలైన్‌లో కాకుండా నేరుగా వైసీపీ అభ్యర్థి వెళ్లటంతో స్థానిక ఓటరు ఒకరు అభ్యంతరం వ్యక్తం చేసాడు. దీంతో వైసీపీ అభ్యర్థి శివకుమార్ ఓటర్‌పై దాడిచేసాడు. దీంతో ఒళ్ళు మండిన ఓటరు వైసీపీ అభ్యర్థి శివకుమార్ చెంపపై కొట్టాడు. దీంతో ఆ ఓటరుపై శివకుమార్ అనుచరులు విచక్షణారహితంగా దాడిచేసారు.