YCP: వైసీపీకి తలనొప్పిగా మారిన "డిజిటల్ బుక్‌"

టీడీపీ రెడ్‌ బుక్‌కు కౌంటర్‌గా వైసీపీ డిజిటల్‌ బుక్‌.. ఫిర్యాదులు నేరుగా హెడ్డాఫీస్‌కు చేరేలా యాప్‌ డిజైన్‌.. యాప్‌ లాంఛ్‌ అయ్యాక తెలిసొచ్చిన అసలు సమస్య

Update: 2025-10-11 05:30 GMT

తె­లు­గు­దే­శం పా­ర్టీ ప్ర­తి­ప­క్షం­లో ఉన్న­ప్పు­డు, అసెం­బ్లీ ఎన్ని­క­ల­కు ముం­దు రె­డ్‌­బు­క్కే హా­ట్‌ టా­పి­క్‌. ఇక కూ­ట­మి అధి­కా­రం­లో­కి వచ్చాక కూడా చాలా రో­జు­లు చర్చం­తా దాని చు­ట్టూ­నే తి­రి­గిం­ది. రా­ష్ట్రం­లో రె­డ్‌­బు­క్‌ రా­జ్యాం­గా­న్ని అమసు చే­స్తు­న్నా­ర­ని, దాని ప్ర­కా­రం తమ కే­డ­ర్‌­ని తీ­వ్రం­గా ఇబ్బం­దు­లు పె­డు­తు­న్నా­ర­ని తీ­వ్ర వి­మ­ర్శ­లు చే­శా­రు వై­సీ­పీ పె­ద్ద­లు. అం­దు­కు కౌం­ట­ర్‌­గా…. కా­ర్య­క­ర్తల కోసం డి­జి­ట­ల్‌ బు­క్‌­ని లాం­ఛ్‌ చే­సిం­ది వై­సీ­పీ అధి­ష్టా­నం. వా­ళ్ళు ఎలాం­టి ఆప­ద­లో ఉన్నా, ఏ సహా­యం అవ­స­ర­మై­నా… క్యూ­ఆ­ర్ కోడ్ స్కా­న్ చే­స్తే వెం­ట­నే పా­ర్టీ కేం­ద్ర కా­ర్యా­ల­‌­యా­ని­కి స‌­మా­చా­రం అం­దే­లా యా­ప్‌­ను డి­జై­న్‌ చే­శా­రు. డి­జి­ట­ల్‌ బు­క్‌­లో నమో­దైన ప్ర­తి ఫి­ర్యా­దు­కు ఓ లె­క్క ఉం­టుం­ద­ని, రేపు అధి­కా­రం­లో­కి వచ్చాక వే­ధిం­చిన వా­ళ్ళ­కు చట్ట ప్ర­కా­రం చు­క్క­లు చూ­పి­స్తా­మ­ని లాం­ఛ్‌ సం­ద­ర్భం­లో ప్ర­క­టిం­చా­రు వై­సీ­పీ పె­ద్ద­లు. అంత వరకు బా­గా­నే ఉన్నా… ఆ తర్వా­తే అసలు సమ­స్య మొ­ద­లైం­దట. అధి­కార పా­ర్టీ వే­ధిం­పు­ల­కు గు­రైన వా­ళ్ళు డి­జి­ట­ల్‌ బు­క్‌­లో ఫి­ర్యా­దు చే­య­డం ఒక ఎత్త­యి­తే… అం­త­కు మిం­చి సొంత పా­ర్టీ నా­య­కుల మీదే ఫి­ర్యా­దు­లు వె­ల్లు­వె­త్త­డం అధి­ష్టా­నా­న్ని ఇరు­కున పడే­స్తోం­దట. మాజీ మం­త్రి వి­డ­దల రజని, మడ­క­శిర మాజీ ఎమ్మె­ల్యే తి­ప్పే­స్వా­మి మీద డి­జి­ట­ల్‌ బు­క్‌­లో ఫి­ర్యా­దు­లు నమో­ద­వ­డం చూసి పా­ర్టీ ము­ఖ్యు­లు షా­కై­న­ట్టు సమా­చా­రం. మనం డి­జి­ట­ల్‌ బు­క్‌­ని పె­ట్టిం­ది దేని కోసం, ఇప్పు­డు జరు­గు­తోం­ది ఏం­టం­టూ పా­ర్టీ సర్కి­ల్స్‌­లో గట్టి చర్చే జరు­గు­తోం­దట. పా­ర్టీ యా­ప్‌­లో సొం­తో­ళ్ళ మీదే ఫి­ర్యా­దు­లు రా­వ­డం కల­క­లం రే­పు­తోం­ది.

విచారణ చేస్తున్న వైసీపీ

చి­ల­క­లూ­రి­పే­ట­కే చెం­దిన నవ­త­రం పా­ర్టీ జా­తీయ అధ్య­క్షు­డు రావు సు­బ్ర­హ్మ­ణ్యం మాజీ మం­త్రి వి­డ­దల రజనీ మీద ఫి­ర్యా­దు చే­శా­రు. తన కా­ర్యా­ల­యం,ఇల్లు, కారు మీద 2022లో వి­డ­దల వర్గీ­యు­లు దాడి చే­శా­రం­టూ… అం­దు­కు సం­బం­ధిం­చిన ఫో­టో­ల­ను కూడా అప్‌­లో­డ్‌ చే­శా­రా­యన. రావు సు­బ్ర­హ్మ­ణ్యం. దీ­ని­కి జగన్ స్పం­దిం­చి తనకు న్యా­యం చే­యా­ల­ని,. తనకు న్యా­యం జరి­గి­తే జగన్ చె­ప్పి­న­ట్టు వై­సీ­పీ కా­ర్య­క­ర్త­ల­కు కూడా న్యా­యం జరు­గు­తుం­ద­న్న నమ్మ­కం కలు­గు­తుం­ద­ని మీ­డి­యా­కు చె­ప్పా­రు నవ­త­రం పా­ర్టీ అధ్య­క్షు­డు. వై­సీ­పీ హయాం­లో తమకు అన్యా­యం జరి­గిం­ద­ని.. న్యా­యం జర­గ­క­పో­తే ఆత్మ­హ­త్య­లే ది­క్కం­టూ ఫి­ర్యా­దు చే­శా­రు శ్రీ సత్య­సా­యి జి­ల్లా చెం­దిన బా­ధి­తు­లు. మడ­క­శిర మాజీ ఎమ్మె­ల్యే తి­ప్పే­స్వా­మి అన్యా­యం చే­శా­ర­ని ఇద్ద­రు బా­ధి­తు­లు డి­జి­ట­ల్ బు­క్‌­లో మా­ట్లా­డిన వీ­డి­యో­లు సో­ష­ల్‌ మీ­డి­యా­లో వై­ర­ల్‌ అవు­తు­న్నా­యి. ము­న్సి­ప­ల్ చై­ర్మ­న్‌ పదవి ఇప్పి­స్తా­నం­టూ… తి­ప్పే­స్వా­మి తన దగ్గర 25 లక్ష­లు తీ­సు­కు­న్న­ట్టు కౌ­న్సి­ల­ర్ ప్రి­యాంక, ఆమె తం­డ్రి వి­క్ర­మ్ డి­జి­ట­ల్ బు­క్‌­లో ఫి­ర్యా­దు చే­శా­రు. తి­రి­గి డబ్బు­లు అడి­గి­తే పా­ర్టీ­కో­స­మే ఖర్చు­చే­శా­న­ని, ఎవ­రి­కి చె­ప్పు­కుం­టా­వో చె­ప్పు­కో­మ­ని బె­ది­రి­స్తు­న్నా­ర­ని, న్యా­యం జర­క్కుం­టే… ఆత్మ­హ­త్య­లే ది­క్కు అని ఆవే­దన వ్య­క్తం చే­శా­రు.

Tags:    

Similar News