YCP: మరీ ఇంత బరితెగింపు మాటలా...?

హద్దులు దాటుతున్న వైసీపీ నేతల బూతులు.. కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటున్న ప్రజలు

Update: 2026-02-02 03:45 GMT

రా­జ­కీ­యా­ల్లో మా­ట­కు ఉన్న బరు­వు, బా­ధ్యత మరో­సా­రి స్ప­ష్ట­మైం­ది. వై­సీ­పీ నేత అం­బ­టి రాం­బా­బు వ్య­వ­హా­రం ఇప్పు­డు రా­ష్ట్ర రా­జ­కీ­యా­ల్లో చర్చ­నీ­యాం­శం­గా మా­రిం­ది. రా­జ­కీయ వి­మ­ర్శ­లు ఒక హద్దు­లో ఉం­టే­నే ప్ర­జా­స్వా­మ్యం­లో అం­గీ­కా­ర­యో­గ్య­మ­వు­తా­య­న్న వా­ద­న­కు ఆయన తాజా పరి­ణా­మా­లు ఉదా­హ­ర­ణ­గా మా­రా­యి. అవ­త­లి­వా­రి­ని వ్యం­గ్యం­గా మా­ట్లా­డ­టం, నా­ట­కీయ సం­భా­ష­ణ­ల­తో సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­య­డం ద్వా­రా గు­ర్తిం­పు తె­చ్చు­కు­న్న రాం­బా­బు­కు అదే శైలి ఇప్పు­డు ఇబ్బం­ది­గా మా­రిం­ది. ఇటీ­వల ఆయన చే­సిన వ్యా­ఖ్య­లు రా­జ­కీయ వి­మ­ర్శల స్థా­యి­ని దాటి వ్య­క్తి­గత దూ­ష­ణ­లు­గా మా­రా­య­ని ప్ర­త్య­ర్థి పా­ర్టీల శ్రే­ణు­లు ఆరో­పి­స్తు­న్నా­యి. ము­ఖ్యం­గా తమ పా­ర్టీ అధి­నే­త­పై తీ­వ్ర పద­జా­లం­తో చే­సిన వ్యా­ఖ్య­లు సభ్య­స­మా­జం తల­దిం­చు­కు­నే­లా ఉన్నా­య­ని తె­లు­గు­దే­శం పా­ర్టీ కా­ర్య­క­ర్త­లు ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. ప్ర­భు­త్వం­పై లేదా రా­జ­కీయ ప్ర­త్య­ర్థు­ల­పై వి­మ­ర్శ­లు సహ­జ­మే­న­ని, కానీ వ్య­క్తి­గ­తం­గా దూ­షిం­చ­డం అస­హ్య­క­ర­మ­ని వారు అం­టు­న్నా­రు.

ఈ నే­ప­థ్యం­లో పె­ద్ద సం­ఖ్య­లో టీ­డీ­పీ, కూ­ట­మి శ్రే­ణు­లు అం­బ­టి రాం­బా­బు ని­వా­సం వైపు తర­లి­వ­చ్చా­రు. మహి­ళ­లు, ది­వ్యాం­గు­లు సైతం ని­ర­స­న­లో పా­ల్గొ­న­డం­తో అక్కడ ఉద్రి­క్త వా­తా­వ­ర­ణం నె­ల­కొం­ది. పో­లీ­సు­లు పరి­స్థి­తి­ని అదు­పు­లో­కి తీ­సు­కొ­చ్చే ప్ర­య­త్నం చే­సి­న­ప్ప­టి­కీ, కొం­త­సే­పు ఉద్రి­క్తత కొ­న­సా­గిం­ది. ఈ ఘట­న­తో రాం­బా­బు వ్యా­ఖ్య­ల­పై రా­జ­కీ­యం­గా మా­త్ర­మే కా­కుం­డా, సా­మా­జి­కం­గా కూడా తీ­వ్ర వి­మ­ర్శ­లు వె­ల్లు­వె­త్తు­తు­న్నా­యి. ఈ వరుస ఘట­న­ల­తో అం­బ­టి రాం­బా­బు రా­జ­కీయ ప్ర­వ­ర్త­న­పై ప్ర­శ్న­లు తలె­త్తు­తు­న్నా­యి. ఒక­వై­పు ఆయన ప్రా­తి­ని­ధ్యం వహి­స్తు­న్న వై­సీ­పీ ప్ర­తి­ష్ఠ­కు భంగం కలు­గు­తోం­ద­న్న వి­మ­ర్శ­లు వస్తు­న్నా­యి. మరో­వై­పు, ప్ర­త్య­ర్థి పా­ర్టీ అయిన తె­లు­గు­దే­శం పా­ర్టీ శ్రే­ణు­లు ఆయ­న­పై కఠిన చర్య­లు తీ­సు­కో­వా­ల­ని డి­మాం­డ్ చే­స్తు­న్నా­యి. మాటల ని­యం­త్రణ లే­క­పో­తే రా­జ­కీ­యం­గా మా­త్ర­మే కా­కుం­డా, న్యా­య­ప­ర­మైన చి­క్కు­లు కూడా తప్ప­వ­ని వి­శ్లే­ష­కు­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు.

రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే ప్రజల నాడి పట్టుకోవాలి కానీ, తాడేపల్లి ప్యాలెస్ మెప్పు కోసం చూడకూడదు. ఇప్పటికైనా వైకాపా నేతలు వాస్తవాలను గ్రహించకపోతే, రాబోయే రోజుల్లో వారు రాజకీయంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. బూతులతో బతుకుదెరువు వెతుక్కునే ప్రయత్నం చేస్తే, ప్రజలు వారిని శాశ్వతంగా పక్కన పెట్టేస్తారు. ఆ విషయం ఇప్పటికే నిరూపితమయింది. అయినా ఈ నేతలకు తెలియడం లేదు. తెలుసుకున్న చాలా మంది సైలెంటుగా ఉన్నారు. 

Tags:    

Similar News