AP : రాజానగరంలో వైసీపీ నేత జక్కంపూడి హల్చల్

Update: 2024-10-17 09:00 GMT

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలను వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అడ్డుకున్నారు. కలవచర్ల గ్రామం వద్ద పోలవరం కాలువకు సంబంధించిన గ్రావెల్ ను అర్ధరాత్రి వేళ తరలిస్తున్న లారీలను పోలీసులకు పట్టించారు. గత రెండు నెలలుగా అక్రమ దందా కొనసాగుతుండటంతో.. తన సోదరుడు జక్కంపూడి గణేష్ సహా వైసిపి నాయకులను వెంట బెట్టుకుని అర్ధరాత్రి సమయంలో తవ్వకాల వద్దకు వెళ్లారు.‌ మైనింగ్ , రెవెన్యూ , పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసి వారు వచ్చేవరకు అక్కడే ఉన్నారు. రాజానగరం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు తప్ప అభివృద్ధి లేదని జక్కంపూడి రాజా విమర్శించారు.

Tags:    

Similar News