AP: వల్లభనేని వంశీ అరెస్ట్.. ఎస్పీ కీలక ప్రకటన

జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు... టీడీపీ శ్రేణుల సంబరాలు;

Update: 2025-02-13 08:45 GMT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు కీలక ప్రకటన విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ తోపాటు పోలీస్ యాక్ట్ - 30 అమలులో ఉన్న నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలు పూర్తిగా నిషేధం అన్నారు. పోలీసుల నిషేదాజ్ఞలను అతిక్రమించి వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. మరోవైపు హైదరాబాద్‌లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తుండగా.. ఆ వాహనాన్ని వంశీ భార్య ఫాలో అయ్యారు. దీంతో ఆమె కారును నందిగామ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఎస్కార్ట్ వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. మరోవైపు వంశీని మొదట విజయవాడ భవానీపురం పీఎస్‌కు తరలించి.. అక్కడి నుంచి కృష్ణలంక పీఎస్‌కు తీసుకెళ్లారు.

దళిత కుటుంబాన్ని వంశీ కిడ్నాప్ చేశారా..?

ఏపీ రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం.. రాజకీయ వేడిని పెంచింది. అయితే వంశీ అరెస్ట్ పై టీడీపీ నేతలు స్పందించారు. దళిత కుటుంబాన్ని వల్లభనేని వంశీ.. కిడ్నాప్ చేసి చంపుతామని బెదిరించారని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. వంశీ ఇప్పటికే చాలా భూ కబ్జాలు చేశారని... తప్పును తప్పు అని ఒప్పుకుంటే వారికి మంచిదని హెచ్చరించారు.

టీడీపీ శ్రేణుల సంబరాలు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో డొంక రోడ్డులో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేశారు. గురువారం మధ్యాహ్నం బాణసంచా కాల్చి స్వీట్లు పంచారు. వంశీ పార్టీకి తీవ్రమైన ద్రోహం చేశారని, అసెంబ్లీలో సైతం అనుచితంగా ప్రవర్తించారన్నారు. ఇటువంటి వారిని తగిన విధంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కేసుతో పాటు, మిగిలిన కేసులపై కూడా వంశీని విచారించాలని కార్యకర్తలు కోరారు. వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను విజయవాడ తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సరిహద్దుల్లో ఆయనను వేరే వాహనంలోకి మార్చినట్టు తెలుస్తోంది. భారీ పోలీస్‌ భద్రత మధ్య వంశీని తరలిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులో అదనపు పోలీసు బలగాలు మోహరించాయి.

వంశీ అరెస్ట్‌పై వైసీపీ రియాక్షన్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌పై వైసీపీ 'ఎక్స్' వేదికగా స్పందించింది. వల్లభనేని వంశీపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించింది. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్‌ ఉందని గుర్తు చేసింది. ఇటీవల సత్యవర్థన్ కూడా ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని తెలిపింది. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News