Visakhapatnam : జ్ఞానానంద ఆశ్రమ భూములపై కన్నేసిన వైసీపీ నేతలు..
Visakhapatnam : విశాఖలో కబ్జారాయుళ్లు చెలరేగిపోతున్నారు. కాదేది కబ్జాకనర్హం అంటూ అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు;
Visakhapatnam : విశాఖలో కబ్జారాయుళ్లు చెలరేగిపోతున్నారు. కాదేది కబ్జాకనర్హం అంటూ అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. విశాఖలోని వెంకాజిపాలెంలో వందల కోట్లు విలువ చేసే 9 ఎకరాల 30 సెంట్ల జ్ఞాననంద ఆశ్రమంపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. హైవేకి ఆనుకొని,నగర మధ్యలో ఉండటంతో అధికార పార్టీ నేతలు ఈ స్థలాన్ని ఎలాగైనా కొట్టేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. స్వామీ పూర్ణనంద పర్యవేక్షణలో ఉన్న ఈ ఆశ్రమంలో ఓ స్కూలు, గోశాల,దేవాలయం ఉన్నాయి.
కొందరు వైసీపీ నేతలు కావాలనే వివాదాలు సృష్టిస్తూ విలువైన స్థలాన్ని కబ్జాచేయాలని ప్రయత్నిస్తున్నారు..ఈ నేపధ్యంలోనే కోర్టును ఆశ్రయించారు స్వామిజీ. కోర్టు ఆశ్రమానికి అనుకూలంగా తీర్పునిచ్చింది అయినా అధికార పార్టీ నేతలు పదే పదే ఆశ్రమంపైకి గొడవకు దిగుతున్నారు. అధికార పార్టీ నేతల నుంచి తనకు, విద్యార్ధులకు, అలాగే గోవులకు కూడా ప్రాణహానీ ఉందని అంటున్నారు పూర్ణనంద స్వామిజీ