సీఎం జగన్‌కు ప్రధాని మోడీ పెద్ద లెక్క కాదు : ఎమ్మెల్యే అమర్‌నాథ్
130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించిన సీఎం జగన్‌కు... ప్రధాని మోడీ పెద్ద లెక్క కాదన్నారు.;
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలో వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించిన సీఎం జగన్‌కు... ప్రధాని మోడీ పెద్ద లెక్క కాదన్నారు. 32 మంది ప్రాణ త్యాగంతో సాధించుకున్న స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తిరగబడే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. అంతేకాదు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రధాని మోడీకి స్వయంగా సీఎం జగన్ లేఖ రాశారని గుర్తు చేశారు. పోరాటాలు సీఎం జగన్‌కు కొత్తేమీ కాదన్నారు.