Baptla : బాపట్లలో విషాదం.. ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతు..
Bapatla : బాపట్ల జిల్లాలో యువకుల విహారయాత్రలో తీవ్ర విషాదం నెలకొంది;
Bapatla : బాపట్ల జిల్లాలో యువకుల విహారయాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. సూర్యలంక బీచ్‌లో సరదగా ఈత కోసం ఎనిమిది మంది యువకులు.. సముద్రంలో దిగారు. భారీ అలల ధాటికి సముద్రంలో మునిగి ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఒకరు ఒడ్డుకు చేరారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది. మృతుల్లో ఇద్దరు విజయవాడ సింగ్‌నగర్ వాసులుగా గుర్తించారు. గల్లంతైనవారి ఆచూకీ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గజఈతగాళ్లతో తీరంలో విస్తృతంగా గాలిస్తున్నారు. అటు నలుగురు నీటమునిగారా..లేక భయంతో బయటకు వెళ్లిపోయారా అన్నకోణంలో విచారణ చేపట్టారు.