YSR GHAT: వైఎస్‌ఆర్‌కు నివాళి.. అన్నా చెల్లెలి మధ్య కనిపించని ఆప్యాయత..
YSR GHAT: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపలపాయలోని YSR ఘాట్ వద్ద..YS కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.;
YSR GHAT: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపలపాయలోని YSR ఘాట్ వద్ద..YS కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. సీఎం జగన్, ఆయన సతీమణి భారతి, తల్లి విజయమ్మ సోదరి షర్మిలతో కలిసి నివాళులనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సుమారు గంటపాటు సీఎం జగన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అయితే కార్యక్రమంలో జగన్‌తో షర్మిల ఆప్యాయంగా ఉండటం ఎక్కడ కనిపించలేదు. నివాళులర్పించక ముందు కానీ.. ఆ తర్వాత కానీ.. జగన్, షర్మిల ఒకరినొకరు పలకరించుకోలేదు. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎవరికి వారు ఘాట్ నుంచి వెళ్లిపోయారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం.. అక్కడికి వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, స్థానికులతో సీఎం జగన్ మాట్లాడారు.