YS Jagan Mohan Reddy: సర్వేలో జగన్ పాలన గురించి సంచలన విషయాలు..

YS Jagan Mohan Reddy: ఏపీ సీఎం జగన్‌ గ్రాప్‌ పడిపోయిందా? 80 శాతానికి పైగా ప్రజల్లో జగన్‌ పాలనపై అసంతృప్తితో ఉన్నారా?

Update: 2021-11-03 08:06 GMT

YS Jagan Mohan Reddy: ఏపీ సీఎం జగన్‌ గ్రాప్‌ పడిపోయిందా? 80 శాతానికి పైగా ప్రజల్లో జగన్‌ పాలనపై అసంతృప్తితో ఉన్నారా? రెండున్నరేళ్లలోనే జగన్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొందా? అంటే అవుననే అంటున్నాయి జాతీయ స్థాయిలో ఇటీవలికాలంలో నిర్వహించిన పలు సర్వేలు. మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పేరిట నిర్వహించిన సర్వేలో జగన్‌ పాలనపై సంచలన విషయాలు వెలుగు చూశాయి.

గత ఏడాది బెస్ట్‌ సీఎంల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న జగన్‌.. ఈసారి చోటే దక్కకపోవడం అతని గ్రాఫ్‌ ఏపీలో పడిపోతోందని చెప్పకనే చెబుతోంది. ఏడాది కాలంలోనే జగన్‌ పాలనపై 11 శాతం వ్యతిరేకత పెరిగినట్లు సర్వే తెలిపింది. జగన్‌పై వ్యతిరేకత పెరుగుతోందని టైమ్స్‌ ఇండియాతో పాటు సమయం పోల్‌ సర్వే కూడా తేల్చింది. రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న జగన్‌ పాలనపై 81 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా, కేవలం 19 శాతం మందే బాగుందని సర్వేలో చెప్పారు.

జగన్‌ ఏకపక్ష నిర్ణయాలు, పాలనలో పారదర్శకత లేకపోవడం, రాజధానిపై అయోమయం సృష్టించడం, సంక్షేమ పథకాల పేరిట రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించడం, ప్రతిపక్షాలపై దాడులు వంటివన్నీ జగన్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతున్నట్లు పేర్కొంది. పొరుగున ఉన్న తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే.. ఏపీ పరిస్థితి రానురాను దిగజారుతుండడం ప్రజల్లో వ్యతిరేకతకు మరో కారణంగా తెలుస్తోంది.

జగన్ గ్రాఫ్ ఇంతలా పడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే ఎవరికి ఎదురవనంతటి వ్యతిరేకతను జగన్‌ మూటగట్టుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. జగన్‌ మాటలకు అర్థాలే వేరయా అన్నట్లుగా ఉందన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్న జగన్‌.. సంపూర్ణంగా మద్యాన్ని తానే అమ్ముకోవడంలా మార్చేశారని ప్రతిపక్షాలు సైతం సెటైర్లు వేస్తున్నాయి. 

Tags:    

Similar News