YS Sharmila : వర్రా అరెస్ట్‌ను స్వాగతించిన వైఎస్ షర్మిల

Update: 2024-11-08 12:45 GMT

తనపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి అరెస్టును స్వాగతిస్తున్నాని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. అరాచక పోస్టులు పెట్టే వాళ్లు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టి కొందరు వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. సోషల్ సైకోల బాధితుల్లో తాను కూడా ఒకరిని అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తనతో పాటు తన తల్లి, సునీతపై విచ్చలవిడిగా పోస్టులు పెట్టారన్నారని తెలిపారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదని అవమానించారన్నారు. తన ఇంటి పేరు మార్చి శునకానందం పొందారని గుర్తు చేశారు. తనపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై తాను కూడా పోలీస్ కేసు పెట్టానన్నారు. అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. మరోసారి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడాలంటే భయపడేలా చర్యలు కొనసాగాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని షర్మిల ట్వీట్ చేశారు.

Tags:    

Similar News