Ambati Rambabu : వైసీపీకి అంబటి రాంబాబు నేర్పిన పాఠం..

Update: 2026-02-03 05:05 GMT

వైసీపీ నేతలు గౌరవప్రదమైన రాజకీయాలకు ఎప్పుడు దూరంగానే ఉంటారనేది అందరికీ తెలిసిందే. ఎంతసేపు అవతలి పార్టీ వాళ్లను బూతులు తిట్టడంతోనే సరిపోతుంది వాళ్ళ తీరు. అధికారంలో ఉన్నంత సేపు వైసీపీ మంత్రులు ఎలాంటి భాష మాట్లాడారు.. మహిళలను ఎంత దారుణంగా అవమానించారు అనేది అందరూ చూశారు. నిండు అసెంబ్లీలో బూతులు మాట్లాడిన చరిత్ర వైసిపి నేతలది. వాళ్ల దారుణాలను తట్టుకోలేక ప్రజలు అత్యంత ఘోరంగా ఓడించినా సరే వైసీపీ నేతల తీరు మారట్లేదు. ఇప్పటికీ రప్ప రప్ప నరికేస్తాం అంటున్నారు. మొన్నటికి మొన్న అంబటి రాంబాబు ఎలాంటి భాష సీఎం చంద్రబాబు మీద వాడారో చూశాం. నాలుగు సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడును పట్టుకొని ఒక మాజీ మంత్రి ఇలాంటి భాష వాడటం అనేది అత్యంత దారుణమనే చెప్పాలి. ఇలాంటి భాషలు టిడిపి నేతలు ఎన్నడూ మాట్లాడి ఉండరు.

అంబటి రాంబాబు హద్దులు దాటేసి మాట్లాడిన బూతులకు పోలీసులు సరైన బుద్ధి చెప్పారు. ప్రస్తుతం అంబటి రాంబాబు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ వైసిపి నేతలు అంబటి రాంబాబు విషయంలో జరిగిన దాన్ని గమనించి మారాల్సిన సమయం వచ్చింది. రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు ఉండాలి. కానీ అవి గౌరవప్రదంగానే ఉండాలి అనేది సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. అంతేగానీ అవతలి పార్టీ నేతలను బూతులు తిట్టమని.. దారుణమైన భాషతో మాట్లాడమని ఎప్పుడూ చెప్పలేదు. కానీ జగన్ మాత్రం తన వైసిపి నేతలను ఇలాంటి బూతు భాషలు మాట్లాడినా సరే ఎంకరేజ్ చేయడం వల్లే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి.

ప్రజలు అసహ్యించుకునేలా మాట్లాడితే ఎవరికైనా చట్టపరంగా శిక్షలు తప్పవు. అది అంబటి రాంబాబు విషయంలో మరోసారి నిరూపితమైంది అంటున్నారు కూటమినేతలు. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నేతలు ఇలాంటి దారుణమైన భాషను మాట్లాడకుండా ఉంటేనే చాలా బెటర్. రాజకీయాల్లో ఉన్న తర్వాత విమర్శలు కచ్చితంగా చేయాల్సిందే. కానీ అవి హద్దులు దాటితేనే ప్రజలు ఛీ కొడతారు అనేది గుర్తుంచుకోవాలి వైసిపి నేతలు.

Tags:    

Similar News