Ex-MLA Gopireddy : వాలంటీర్లు వల్లే వైసీపీ ఓడింది - మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి
వాలంటీర్ల వల్లే వైసీపీ ఓడిపోయిందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే మూలస్తంభాలని.. వాలంటీర్లు కాదని చెప్పారు. ప్రజలు, పాలకులకు మధ్య వారధిలా కార్యకర్తల్ని ఉంచాలని జగన్‌కు సూచించానని.. కానీ ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోయాక జగన్‌ను కలిసి మాట్లాడినప్పుడు ఇదే మాట చెప్పానన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీ నేతల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజలకు వాలంటీర్ల ద్వారా అందించారని, అదే కార్యకర్తల ద్వారా ఇచ్చి ఉంటే ఎన్నికల్లో పరిస్థితి మరో ఉండేదన్నారు. వాలంటీర్ల వల్లే పార్టీ ఆగమైందని అన్నారు. కార్యకర్తలపై మాత్రమే కేసులు పెడుతున్నారని.. వాలంటీర్లపై కాదని అన్నారు. ఇప్పటికైనా జగన్ దీనిపై ఆలోచించాలని కోరారు.