వైసీపీ లీడర్లకు దేవుడంటే కనీసం భక్తి, గౌరవం కూడా లేకుండా పోతున్నాయి. ఎలా పడితే అలా ప్రవర్తించేస్తున్నారు. నిన్న శాసనమండలిలో ఎమ్మెల్సీలు రాజీనామా చేసే సందర్భంగా శ్రీవారి ఫొటోలు పట్టుకుని వచ్చారు. అయితే దేవుడి ఫొటోలను చెప్పులు, బూట్లు వేసుకుని పట్టుకుని తమ తీరును మరోసారి బయటపెట్టుకున్నారు వైసీపీ లీడర్లు. దేవుడు అంటే తమకు లెక్కలేదని శాసనమండలి సాక్షిగా బయటపెట్టుకున్నారు. పైగా దేవుడి ఫొటోలను పట్టుకొచ్చి మండలిలోనే వదిలేసి వెళ్లిపోయారు.
వాళ్ల తీరు ఎంత దారుణంగా ఉందంటే.. చూసే వారికి కూడా చాలా ఆగ్రహం తెప్పించేలానే. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై యావత్ హిందూ సమాజం మండిపడుతోంది. దేవుడంటే కనీసం లెక్కలేదా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడిని అవమానిస్తారా అంటూ మండిపడుతున్నారు. ఇది మహాపరాధం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ లీడర్లు మాత్రం తమ చర్య మీద కనీసం స్పందించట్లేదు.
ఇలా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన వీరికి.. తిరుమలలో లడ్డూను కల్తీ చేయడం ఒక లెక్కనా అంటున్నారు కూటమి నేతలు. ఇలాంటి వారిని దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడని ఫైర్ అవుతున్నారు. మాజీ సీఎం జగన్ తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోడానికి ఇలా దేవుడితో ఆటలాడుతున్నారంటూ కూటమి మండిపడుతోంది.