సార్వత్రిక ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉండేది. ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరిగా జగన్ కు దూరం అవుతూ వస్తున్నారు. గతేడాది ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకట రమణ, ఆర్. కృష్ణయ్యలు వైకాపాకు, రాజ్యసభకు రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభలో వైకాపా బలం 8కి పడిపోయింది. తాజాగా విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో వైసీపీ బలం 7 మందికే పరిమితం కాబోతుంది. త్వరలో మరో ఇద్దరు సభ్యులు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది.