Yuvagalam: వాళ్లు మార్ఫింగ్ మరీచులు
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫేక్ వీడియోలపై మండిపడిన లోకేశ్...;
లోకేష్ యువగళం పాదయాత్ర సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. అన్ని వర్గాలతో మమేకం అవుతున్నారు యువనేత. అయితే ఆయనకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే యువగళంపై అధికారపార్టీ పత్రిక విషం చిమ్ముతుందన్న విమర్శలు వస్తున్నాయి.లోకేష్ మాటలను వక్రీకరించి రాస్తున్నరని పలు వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఫేక్ రాతల వెనుక వైసీపీ సోషల్ మీడియా, ఐప్యాక్ టీం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే లోకేష్ టీడీపీ అధికారంలోకి వస్తే విదేశీ విద్యా పథకానికి మళ్లీ అంబేడ్కర్ పేరే పెడతామని, దళితులకు జగన్ చేసిందేమీలేదని అన్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలను వైసీపీ సోషల్ మీడియా, జగన్‌కు చెందిన పత్రిక వక్రీకరించాయని టీడీపీ నేత లోకేశ్ మండిపడ్డారు.వైసీపీ మార్ఫింగ్ మారీచులు అంటూ దుమ్మెత్తిపోశారు.