టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. లోకేష్ వెనక పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేష్‌కు ఎక్కడికక్కడ ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మంగళహారతులు పడుతున్నారు. మారెళ్ల శివార్లలో VRAలతో సమావేశమైన నారా లోకేష్ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ అధికారంలోకి రాగానే VRAల జీతాలు పెంచుతామని హామి ఇచ్చారు నారా లోకేష్. పేస్కేలు అమలు జరిగేలా చూస్తానన్నారు. వీఆర్‌ఏల సమస్యలపై సానుకూలంగా స్పందించిన లోకేష్.. రాష్ట్రంలో అన్నిరకాల ఉద్యోగులను జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పనిచేస్తూ సేవలందిస్తున్న వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లకు టీడీపీ మద్దతు ఇస్తుందని భరోసా కల్పించారు.