దళితుల దెబ్బకు సీఎం జగన్‌కు దిమ్మతిరిగాలి

Update: 2023-05-21 12:24 GMT

దళితుల దెబ్బకు సీఎం జగన్‌కు దిమ్మతిరిగి బొమ్మ కనపడాలన్నారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. ఆకాశంలో ఊహల్లో తేలుతున్న జగన్‌ను భూమి మీదకు తీసుకురావాలన్నారు. ఏపీలో దళితులపై దాడులు, ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. నాలుగేళ్లలో జగన్ సర్కార్ అనేక మంది దళితులను పొట్టనపెట్టుకుందన్న వర్ల రామయ్య... దళితులంతా ఏకతాటిపైకి రావాలన్నారు. వైసీపీలోని దళిత ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాల్లా మారారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. అప్పుడెప్పుడో చూసిన శిరోముండనాలు మళ్లీ జగన్ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయని మండిపడ్డారు.

Similar News