MG Hector : సరికొత్త 2026 ఎంజీ హెక్టర్.. నేడు లాంచ్.. లుక్, ఫీచర్స్, ADAS లో భారీ అప్‌డేట్స్.
MG Hector :ఎంజీ మోటార్ ఇండియా 2026 మోడల్ MG హెక్టర్ను కొత్త అవతారంలో డిసెంబర్ 15, 2025న భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఈ ఫేస్‌లిఫ్ట్ ద్వారా కంపెనీ హెక్టర్‌ను మరింత ప్రీమియంగా మార్చాలని చూస్తోంది, తద్వారా కస్టమర్ల ఆసక్తిని మళ్లీ పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌లో రాబోతున్న 5 ముఖ్యమైన మార్పులు, విశేషాలేంటో తెలుసుకుందాం.
1. ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ డిజైన్
2026 MG హెక్టర్ డిజైన్‌లో స్పష్టమైన మార్పులు కనిపించే అవకాశం ఉంది. దీని రోడ్ ప్రజెన్స్ మరింత మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. ముందు భాగంలో పెద్ద, ఆకర్షణీయమైన గ్రిల్‌ను అందించవచ్చు. అలాగే, ముందు, వెనుక బంపర్‌లలో కూడా మార్పులు ఉంటాయి. మునుపటిలాగే, డిజైన్‌లో క్రోమ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇది ఎస్‌యూవీ ప్రీమియం లుక్‌ను మరింత పెంచుతుంది. ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు, కానీ వెనుక టెయిల్ ల్యాంప్స్‌లో చిన్నపాటి అప్‌డేట్ ఆశించవచ్చు. అంతేకాకుండా దీనికి కొత్త డిజైన్‌తో కూడిన అలాయ్ వీల్స్‌ను అందించవచ్చు, వీటి సైజు 19 అంగుళాల వరకు పెరిగే అవకాశం ఉంది.
2. క్యాబిన్‌లో కొత్తదనం
ప్రస్తుతానికి ఇంటీరియర్ గురించి పూర్తి సమాచారం అందుబాటులో లేనప్పటికీ, హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌లో క్యాబిన్‌కు కొత్త లుక్ ఇవ్వడానికి కొత్త అప్‌హోల్‌స్ట్రీ ఆప్షన్లు, కొత్త కలర్ థీమ్‌లు ఉండవచ్చు. పెద్ద వెర్టికల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ యధావిధిగా కొనసాగుతుంది, కానీ దాని యూజర్ ఇంటర్‌ఫేస్ మరింత మోడ్రన్ గా, ఉపయోగించడానికి సులభంగా మారుతుందని అంచనా.
3. ఫీచర్ల జాబితా మరింత పెద్దది
ఎంజీ హెక్టర్ తన సెగ్మెంట్‌లో ఎప్పుడూ ఫీచర్లకు ప్రసిద్ధి. ఈ ఫేస్‌లిఫ్ట్‌లో దీనిని మరింత మెరుగుపరచవచ్చు. ఇప్పటికే ఉన్న ఫీచర్లతో పాటు, వెనుక సీట్లకు వెంటిలేషన్ వంటి కొన్ని కొత్త ప్రీమియం ఫీచర్లను జోడించవచ్చు. పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియెంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పవర్డ్ డ్రైవర్ సీట్, ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా గతంలో మాదిరిగానే లభిస్తాయి.
4. సేఫ్టీ, ADAS పై దృష్టి
సేఫ్టీ విషయంలో 2026 హెక్టర్‌లో ఎలాంటి రాజీ ఉండదు. ఇందులో స్టాండర్డ్ ఫీచర్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), పార్కింగ్ సెన్సార్‌లు, హిల్ అసిస్ట్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఉంటాయని భావిస్తున్నారు. ఎస్‌యూవీలో లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెెన్స్ సిస్టమ్) కొనసాగుతుంది, దీనికి కొన్ని కొత్త డ్రైవర్ అసిస్ట్ ఫీచర్లను జోడించవచ్చు. 360 డిగ్రీ కెమెరా మరియు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.
5. ఇంజిన్లలో మార్పు లేదు
మెకానికల్‌గా ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎటువంటి మార్పులు ఉండవు. ఇందులో మునుపటిలాగే 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు లభిస్తాయి. పెట్రోల్ ఇంజిన్ 141 bhp పవర్, 50 Nm టార్క్ ఇస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గియర్‌బాక్స్‌తో వస్తుంది. డీజిల్ ఇంజిన్ 167 bhp పవర్, 350 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గియర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రీమియం డిజైన్, ఫీచర్లపై ఎక్కువ దృష్టి సారించిన 2026 MG హెక్టర్, ఈ ఏడాది చివర్లో లాంచ్ అయి, రద్దీగా ఉండే ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.