ఎండలు మండుతున్నాయి.. ఏసీ, ప్రిజ్ ధరలు పెరగనున్నాయి

ఏసీల ధరలు 4 శాతం నుండి 6 శాతం మేర పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Update: 2021-03-13 06:52 GMT

వేసవి కాలం వచ్చేసింది.. ఏసీ, ప్రిజ్‌లతో పనెక్కువ పడుతుంది. కరోనా దెబ్బ అన్ని వ్యాపారాల మీద పడి కోలుకోనివ్వకుండా చేసింది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న దశలో తమ వ్యాపారాలను గాడిలో పెట్టేందుకు కొన్ని ఎలక్ట్రానిక్ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలు పెంచే దిశగా ఆలోచిస్తున్నాయి. రా మెటీరియల్ ఖర్చులు, ధరలు పెరగడంతో ఉత్పత్తుల ధరలు పెంచేందుకు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దాదాపు అన్ని వస్తువల ధరలు పెరిగినందున తప్పనిసరి పరిస్థితుల్లో పెంచుతున్నట్లు చెబుతున్నాయి. ఏసీల ధరలు 4 శాతం నుండి 6 శాతం మేర పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రూ.1500లు ఉంటే ఆ వస్తువు రూ.2000లకు పెరగవచ్చు.

ఏసీ అమ్మకాలు ఇటీవల పుంజుకున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలలో ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఈ ఏడాది రెండు సార్లు ధరలు పెంచాయి.

లాక్‌డౌన్ కారణంగా గత ఏడాది ఏసీ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం డిమాండ్ నెలకొనడంతో అమ్మకాలు జోరందుకుంటాయని కంపెనీలు భావిస్తున్నాయి. భారత్‌లో ఏసీల పరిశ్రమ 70-75 లక్షల యూనిట్లుగా ఉంది. ఏప్రిల్ నెల నుండి టీవీల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. 

Tags:    

Similar News