ADANI CASE: ఆదానీ కేసు.. అమెరికాకు తప్పని ఆటంకాలు

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై కేసు.. రూ.2,029 కోట్లు లంచం ఇచ్చినట్లు ఆరోపణ.. ఏడాది పాటు కుప్పకూలిన అదానీ షేర్లు;

Update: 2025-08-23 07:30 GMT

ప్ర­ముఖ వ్యా­పా­ర­వే­త్త, భారత కు­బే­రు­ల­లో ఒక­రైన గౌ­త­మ్ అదా­నీ గు­రిం­చి ప్ర­త్యే­కం­గా చె­ప్పా­ల్సిన అవ­స­రం లేదు. కే­వ­లం పదే­ళ్ల­లో భా­ర­త్‌­లో­నే కాదు.. ప్ర­పం­చం సం­ప­న్నుల జా­బి­తా­లో చే­రిన ఏకైక వ్య­క్తి. అతి తక్కువ కా­లం­లో అత్యంత సం­ప­న్ను­డి­గా గు­ర్తిం­పు పొం­దా­రు. అయి­తే, గౌ­త­మ్‌ అదా­నీ ఎంత వే­గం­గా ఎది­గా­డో.. అంతే వే­గం­గా పడి­పో­యా­డు. గౌ­త­మ్‌ అదా­నీ­పై అమె­రి­కా­లో అభి­యో­గా­లు నమో­ద­య్యా­యి. తప్పు­డు లె­క్కల ఆరో­ప­ణ­ల­తో దా­దా­పు ఏడా­ది పాటు అదా­నీ షే­ర్లు కు­ప్ప­కూ­లా­యి. రూ.లక్షల కో­ట్ల నష్టం జరి­గిం­ది. తర్వాత అదా­నీ­పై నమో­దైన లంచం కేసు ప్ర­పంచ దృ­ష్టి­ని ఆక­ర్షిం­చిం­ది. 2024 నవం­బ­ర్‌­లో నమో­దైన ఈ కే­సు­లో సౌర వి­ద్యు­త్‌ ప్రా­జె­క్టు కాం­ట్రా­క్టుల కోసం భారత రా­జ­కీయ నా­య­కు­ల­కు రూ.2,029 కో­ట్ల లంచం ఇచ్చి­న­ట్లు ఆరో­ప­ణ­లు వచ్చా­యి.

 అమెరికాలో కేసులు

అమె­రి­కా న్యూ­యా­ర్క్‌­లో­ని ఫె­డ­ర­ల్‌ కో­ర్టు­లో దా­ఖ­లైన ఈ కేసు, అదా­నీ గ్రూ­ప్‌ సం­స్థ అయిన అదా­నీ గ్రీ­న్‌ ఎన­ర్జీ, అమె­రి­కా పె­ట్టు­బ­డి­దా­రుల నుం­చి ని­ధు­లు సమీ­క­రిం­చ­డం­లో మో­స­పూ­రిత ప్ర­క­ట­న­లు చే­సి­న­ట్లు ఆరో­పి­స్తోం­ది. ఈ ని­ధు­ల­ను ఉప­యో­గిం­చి, భా­ర­త­దే­శం­లో­ని వి­విధ రా­ష్ట్ర ప్ర­భు­త్వా­ల­కు లం­చా­లు ఇచ్చి, సౌర వి­ద్యు­త్‌ కాం­ట్రా­క్టు­ల­ను సా­ధిం­చి­న­ట్లు ఎస్‌­ఈ­సీ పే­ర్కొం­ది. ము­ఖ్యం­గా, ఏపీ­లో జగ­న్‌­మో­హ­న్‌­రె­డ్డి హయాం­లో వి­విధ నా­య­కు­ల­కు లంచం ఇచ్చి­న­ట్లు ఆరో­ప­ణ­లు ఉన్నా­యి. వి­విధ రా­ష్ట్రా­ల్లో కూడా ఇలా­గే ఒప్పం­దం చే­సు­కు­న్నా­ర­న్న ఆరో­ప­ణ­లు ఉన్నా­యి.

విచారణకు ఆటంకాలు

ఈ కేసులో గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్‌ అదానీతో సహా ఎనిమిది మందిపై న్యూయార్క్‌ ఈస్టర్న్‌ డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయం నేరారోపణలు మోపింది. అయితే, సమన్లు జారీ చేయడంలో ఎస్‌ఈసీ సవాళ్లను ఎదుర్కొంటోంది.హేగ్‌ సర్వీస్‌ కన్వెన్షన్‌ కింద భారత న్యాయశాఖ ద్వారా సమన్లను అందజేయాల్సి ఉన్నప్పటికీ, అహ్మదాబాద్‌ కోర్టుకు పంపిన ఈ సమన్లపై ఎలాంటి స్పందన రాలేదు. 2025 ఆగస్టు నాటికి నాలుగు నెలలు గడిచినప్పటికీ, సమన్లు అందలేదని ఎస్‌ఈసీ తన రిపోర్టులో తెలిపింది. ఈ జాప్యానికి ప్రభుత్వం అదానీతో ఉన్న సన్నిహిత సంబంధాలే కారణమని ఆరోపణలు వస్తున్నాయి.

భారత ప్రభుత్వం సహకారం లేకనే?

ఈ కేసు భారత ప్ర­భు­త్వం, అదా­నీ గ్రూ­ప్‌ మధ్య సం­బం­ధా­ల­పై తీ­వ్ర చర్చ­ను రే­కె­త్తిం­చిం­ది. ఎస్‌­ఈ­సీ పదే­ప­దే భారత న్యా­య­శాఖ సహ­కా­రం కో­రి­న­ప్ప­టి­కీ, ఎలాం­టి స్పం­దన లే­క­పో­వ­డం వి­మ­ర్శ­ల­కు దా­రి­తీ­సిం­ది. భారత ప్ర­భు­త్వం అదా­నీ­ని రక్షిం­చేం­దు­కు ఉద్దే­శ­పూ­ర్వ­కం­గా సహ­క­రిం­చ­డం లే­ద­ని పలు­వు­రు ఆరో­పి­స్తు­న్నా­రు. ఈ ఆరో­ప­ణ­లు, రా­జ­కీయ నా­య­కు­ల­తో అదా­నీ గ్రూ­ప్స్‌­తో సన్ని­హిత సం­బం­ధా­ల­ను మరింత ప్ర­శ్నా­ర్థ­కం చే­స్తు­న్నా­యి.

 ఆంధ్రప్రదేశ్‌కు లింకు..

ఈ కే­సు­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ప్ర­స్తా­వన రా­వ­డం రా­ష్ట్ర రా­జ­కీ­యా­ల­లో కల­క­లం రే­పిం­ది. 2019 నుం­చి 2024 మధ్య జగ­న్‌­మో­హ­న్‌­రె­డ్డి ము­ఖ్య­మం­త్రి­గా ఉన్న సమ­యం­లో, రూ. 1,750 కో­ట్ల లంచం వి­విధ నా­య­కు­ల­కు ఇచ్చి­న­ట్లు ఆరో­ప­ణ­లు ఉన్నా­యి. ఈ ఆరో­ప­ణ­లు రు­జు­వై­తే, భవి­ష్య­త్తు­లో జగ­న్‌­మో­హ­న్‌ రె­డ్డి పేరు కూడా వి­చా­ర­ణ­లో­కి రా­వ­చ్చ­ని న్యాయ ని­పు­ణు­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. ఈ కే­సు­ను మొదట ఏపీ­లో­ని కూ­ట­మి సర్కా­ర్‌ ప్ర­తి­ష్టా­త్మ­కం­గా తీ­సు­కుం­ది. తర్వాత కేం­ద్రం ఒత్తి­డి­తో సై­లెం­ట్‌ అయిం­ది. ఈ కేసు కేవలం అదానీ గ్రూప్‌కు మాత్రమే కాకుండా, భారత వ్యాపార రంగంలో అంతర్జాతీయ పెట్టుబడులపై కూడా ప్రభావం చూపవచ్చు.

Tags:    

Similar News