Toyota Rumion CNG : 7 సీటర్ కారు..26 కిలోమీటర్ల మైలేజీ..టయోటా రూమియన్ కొనేందుకు క్యూ కడుతున్న జనం.

Update: 2026-01-29 10:45 GMT

Toyota Rumion CNG : టయోటాను కేవలం ఖరీదైన ఇన్నోవా లేదా ఫార్చ్యూనర్ లాంటి కార్లకే పరిమితం అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం మధ్యతరగతి ఫ్యామిలీల చూపు టయోటా నుంచి వచ్చిన ఒక సూపర్ 7-సీటర్ కారుపై పడింది. అదే టయోటా రూమియన్. మారుతి అలియాస్ అడ్డా నుంచి వచ్చిన అరీనా అప్డేటెడ్ వెర్షన్ అని చెప్పుకునే ఈ కారు, ఇప్పుడు సీఎన్జీ మార్కెట్‌లో దుమ్మురేపుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 11,137 మంది ఈ కారును కొనుగోలు చేసి, టయోటా పోర్ట్‌ఫోలియోలోనే టాప్ సెల్లింగ్ సీఎన్జీ కారుగా నిలబెట్టారు.

టయోటా ఇండియాలో ఇన్నోవా క్రిస్టా, హైరైడర్ వంటి మోడళ్లకు విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ, సీఎన్జీ విభాగంలో మాత్రం రూమియన్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో టయోటా విక్రయించిన సిఎన్‌జి కార్లలో రుమియన్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ కారును మారుతి సుజుకి అరీనా ప్లాట్‌ఫామ్‌పైనే రూపొందించారు. ఇంజిన్ నుంచి ఫీచర్ల వరకు దాదాపు అన్నీ అరీనాను పోలి ఉన్నప్పటికీ, టయోటా బ్రాండ్ వాల్యూ, సర్వీస్ భరోసా ఈ కారును కస్టమర్లకు మరింత దగ్గర చేశాయి.

రుమియన్ సీఎన్జీ వేరియంట్ ఎంతటి డిమాండ్‌లో ఉందంటే.. టయోటాలోని ఇతర సిఎన్‌జి మోడళ్లు ఏవీ కనీసం 10 వేల మార్కును కూడా దాటలేదు. రుమియన్ 11,137 యూనిట్ల విక్రయాలతో దూసుకుపోతుంటే, గ్లాంజా సిఎన్‌జి (6,612), అర్బన్ క్రూజర్ టైజర్ సిఎన్‌జి (5,380), హైరైడర్ సిఎన్‌జి (4,960) యూనిట్లకే పరిమితమయ్యాయి. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు కావాల్సిన స్పేస్, మైలేజీని రుమియన్ సంపూర్ణంగా అందిస్తోందని స్పష్టమవుతోంది.

టయోటా రుమియన్ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.10.44 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, అత్యధికంగా అమ్ముడవుతున్న సిఎన్‌జి వేరియంట్ (S మోడల్) ధర రూ.11,35,900 గా ఉంది. వివిధ వేరియంట్ల ధరలు కింది విధంగా ఉన్నాయి:

1.5L పెట్రోల్-మాన్యువల్: రూ. 10.44 లక్షల నుంచి రూ. 12.26 లక్షల వరకు.

1.5L పెట్రోల్-ఆటోమేటిక్: రూ. 11.89 లక్షల నుంచి రూ. 13.61 లక్షల వరకు.

1.5L సిఎన్‌జి-మాన్యువల్: రూ. 11.35 లక్షలు.

రుమియన్‌లో 1.5 లీటర్ కె-సిరీస్ ఇంజిన్‌ను అమర్చారు. పెట్రోల్ మోడ్‌లో ఇది 102 bhp పవర్, 137 Nm టార్క్ ఇస్తుంది. అదే సిఎన్‌జి మోడ్‌లో 87 bhp పవర్, 121.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక మైలేజీ విషయానికి వస్తే పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20.51 కిలోమీటర్లు ఇస్తుండగా, సిఎన్‌జి వేరియంట్ ఏకంగా 26.11 km/kg మైలేజీని అందిస్తుంది. లాంగ్ ట్రిప్స్ వేసే ఫ్యామిలీలకు ఇది చాలా పొదుపుగా మారుతుంది.

ఈ 7-సీటర్ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సెకండ్ రో ఏసీ వెంట్స్, టయోటా ఐ-కనెక్ట్ వంటి 55 కంటే ఎక్కువ స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రత పరంగా.. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. మొత్తానికి తక్కువ ఖర్చుతో కూడిన లగ్జరీ ఫ్యామిలీ జర్నీ కోసం రుమియన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి.

Tags:    

Similar News