Charminar: చార్మినార్‌ దగ్గర ఉద్రిక్తత.. నుపుర్‌ శర్మ వ్యాఖ్యలపై నిరసన..

Charminar: చార్మినార్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నుపుర్‌ శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ ముస్లింలు ర్యాలీ నిర్వహిస్తున్నారు.

Update: 2022-06-10 12:45 GMT

Charminar: హైదరాబాద్‌ పాత బస్తీ చార్మినార్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మహ్మద్‌ ప్రవక్తపై నుపుర్‌ శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ ముస్లింలు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత ర్యాలీగా బయల్దేరారు. నుపుర్‌ శర్మ, నిత్యానంద, రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

మహ్మద్‌ ప్రవక్తపై నుపుర్‌ శర్మ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా.. దేశవ్యాప్తంగా ముస్లింలు నిరసనలు చేశారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్లో ఒక్కసారిగి నిరనసలకు దిగారు ముస్లింలు. అతిపెద్ద మసీదులలో ఒకటైన ఢిల్లీలో జామా మసీదు బయట నిరసన చేశారు. బెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో హింసాత్మక ఘటనలు నెలకొన్నాయి. నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీసులపై రాళ్లు రువ్వారు నిరసనకారులు.

దీంతో పలు చోట్లు పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. అటు కోల్‌కతాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక్కడ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. మరోవైపు హైదరాబాద్‌ పాతబస్తీ బార్కస్‌ ప్రాంతంలోని జమా మసీద్‌ వద్ద శాంతియుతంగా నిరసనలు తెలిపారు ముస్లింలు. చార్మినార్‌, ముషారాంబాగ్‌తో పాటు పలు చోట్లు నిరసనలకు దిగారు. నుపూర్‌ శర్మ వ్యాఖ్యలకు ఖండిస్తూ.. ఆందోళనకు దిగారు. ప్రపంచంలో ఉన్న ముస్లిందేశాలు దీనిపై తీవ్రంగా పరిగణిస్తున్నాయన్నారు. నుపుర్‌ శర్మను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News