New 2026 Models : కొత్త కారు కోసం వెయిట్ చేస్తున్నారా? 2026లో రాబోతున్న టాప్-7 ఫేస్‌లిఫ్ట్ కార్లు ఇవే.
New 2026 Models : 2026 సంవత్సరం ఆటోమొబైల్ రంగానికి ఒక పండగలా మారబోతోంది. టాటా పంచ్ ఈవీ నుంచి మహీంద్రా స్కార్పియో వరకు.. మార్కెట్లో ఇప్పటికే దుమ్మురేపుతున్న పాపులర్ కార్లన్నీ ఇప్పుడు కొత్త హంగులతో మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. పాత మోడల్ కొని తర్వాత బాధపడటం కంటే, ఈ అప్‌డేటెడ్ వెర్షన్లు ఏంటో ఓ లుక్కేయండి.
టాటా పంచ్ ఈవీ
టాటా మోటార్స్ తన సంచలన మైక్రో ఎస్‌యూవీ పంచ్ ఈవీని ఫిబ్రవరి 20న సరికొత్తగా లాంచ్ చేయబోతోంది. ఈసారి ఇందులో ప్రధాన మార్పు బ్యాటరీ ప్యాక్. నెక్సాన్ ఈవీ నుంచి సేకరించిన 45kWh భారీ బ్యాటరీని ఇందులో అమర్చబోతున్నారు. దీనివల్ల ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ లభిస్తుందని టాక్. అంతేకాకుండా లోపల పెద్ద టచ్‌స్క్రీన్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరాతో ఈ కారు లగ్జరీ లుక్‌ను సంతతం చేసుకోనుంది.
మహీంద్రా స్కార్పియో N
మహీంద్రా తన అత్యంత శక్తివంతమైన స్కార్పియో Nకు ఫేస్‌లిఫ్ట్ ఇవ్వబోతోంది. ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారుకు ఈ ఏడాది చివరిలో కొత్త రూపం రానుంది. ప్రధానంగా దీని లోపలి భాగంలో భారీ మార్పులు ఉండబోతున్నాయి. కస్టమర్ల కోరిక మేరకు ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ , కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను జోడించబోతున్నారు. దీని ఫ్రంట్ డిజైన్ కూడా మరింత అగ్రెసివ్‌గా మారనుంది.
స్కోడా కుషాక్, స్లావియా
స్కోడా కంపెనీ 2026 మార్చిలో కుషాక్ ఫేస్ ಲಿఫ్ట్‌ను విడుదల చేయనుంది, ఆ వెంటనే స్లావియా అప్‌డేట్ కూడా రానుంది. ఇంజన్ పరంగా పెద్ద మార్పులు లేకపోయినా, ఇప్పుడు ఇందులో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టడం విశేషం. మూడు కొత్త రంగులు, పనోరమిక్ సన్‌రూఫ్, మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో ఇవి మార్కెట్లోకి రాబోతున్నాయి. సెడాన్ ప్రియుల కోసం స్లావియా గ్లోబల్ డిజైన్ హంగులను అద్దుకోనుంది.
హ్యుందాయ్ వెర్నా, ఎక్స్టర్
హ్యుందాయ్ ఇప్పటికే ఇండియాలో తన వెర్నా, ఎక్స్టర్ కార్ల టెస్టింగ్‌ను షురూ చేసింది. ముఖ్యంగా 2026 వెర్నా పూర్తిస్థాయిలో గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌తో రాబోతోంది. కొత్త ఫ్రంట్ గ్రిల్, మెరుగైన ఇంటీరియర్ ఫినిషింగ్‌తో ఇది మరింత ప్రీమియంగా ఉండనుంది. ఇక ఎక్స్టర్ విషయానికొస్తే, కొత్త బంపర్లు, కొత్త వేరియంట్లతో చిన్న ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మళ్ళీ నంబర్ 1 స్థానం కోసం పోటీ పడనుంది.
మారుతి బ్రెజ్జా
మారుతి సుజుకి తన బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ బ్రెజ్జాలో ఊహించని మార్పులు చేయబోతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) రాబోతోంది. సీఎన్‌జీ మోడల్ వాడేవారి కోసం అండర్ బాడీ సీఎన్‌జీ ట్యాంక్ సదుపాయం ఉండనుంది. డిజైన్ పరంగా విక్టోరిస్ తరహాలో మార్పులు జరిగే అవకాశం ఉంది. మైలేజీతో పాటు సేఫ్టీకి కూడా ప్రాధాన్యత ఇచ్చేలా మారుతి ఈ ప్లాన్ చేస్తోంది.