Anand Mahindra: మదర్స్ డే సందర్భంగా ఇడ్లీ అమ్మకు ఆనంద్ మహీంద్ర గిఫ్ట్.. మాట నిలబెట్టుకున్నారుగా..!

Anand Mahindra: 37 ఏళ్లుగా రూపాయికే నాలుగు ఇడ్లీలు అందిస్తూ ఆకలి తీరుస్తుంది కాబట్టి ఇడ్లీ అమ్మ అని పిలవడం మొదలుపెట్టారు

Update: 2022-05-09 03:05 GMT

Anand Mahindra: వ్యాపారవేత్తగా తాను ఎంత ఎదిగినా కూడా తన చుట్టూ ఉండేవారికి తోచిన సాయం చేయాలనుకునే వారు ఉంటారు. అందులో చెప్పుకోవాల్సిన ఓ పేరు ఆనంద్ మహీంద్ర. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్ర.. సోషల్ యాక్టివిటీస్‌లో కూడా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆనంద్ మహీంద్ర చేసిన ఓ పనికి నెటిజన్లు శభాష్ అంటున్నారు.

ఇతరులకు సాయం చేయాలి అనుకుంటే వయసుతో, ఆర్థిక స్థోమతతో సంబంధం లేదు అని నిరూపించిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే ఇడ్లీ అమ్మ. ఆమె అసలు పేరు కమలాత్తాళ్‌ అయినా కూడా ఇడ్లీ అమ్మగానే తన అందరికీ పరిచయం. ఎందుకంటే 37 ఏళ్లుగా రూపాయికే నాలుగు ఇడ్లీలు అందిస్తూ పేదల ఆకలి తీరుస్తుంది కాబట్టి తనను అందరూ ఇడ్లీ అమ్మ అని పిలవడం మొదలుపెట్టారు.

తమిళనాడులోని వడివెలంపాలయం గ్రామానికి చెందిన కమలాత్తాళ్‌ అలియాస్ ఇడ్లీ అమ్మకు సొంత ఇల్లు అందజేస్తానని ఆనంద్ మహీంద్ర కొన్నాళ్ల క్రితం ట్విటర్ వేదికగా ప్రకటించారు. అయితే ఆ ఇల్లు కట్టడం సకాలంలో పూర్తయ్యి మదర్స్ డే నాడు ఇడ్లీ అమ్మ చేతికి వచ్చింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్వీట్ చేసి అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు ఆనంద్ మహీంద్ర.

Tags:    

Similar News