Anand Mahindra: నీ టాలెంట్ అదిరింది బాస్.. ఒలింపిక్స్‌కి వెళితే మెడల్ పక్కా: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra: ఈ వ్యక్తి బాడీలో జైరోస్కోప్‌తో పుట్టిన మానవ సెగ్వేలాగా ఉన్నాడు.;
Anand Mahindra: ఆనంద్ మహీంద్ర ఓ వ్యాపారవేత్తగా ఎంత ఎదిగినా.. ట్విటర్‌లో తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు అందరితో పంచుకుంటూనే ఉంటారు. అందులో చాలావరకు మోటివేషనల్ వీడియోలు ఉంటాయి. రకరకాల వీడియోలను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్ర.. టీమ్ వర్క్ అంటే ఎలా ఉండాలి, హార్డ్ వర్క్ అంటే ఎలా ఉండాలి అని చెప్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఒక మోటివేషనల్ వీడియోని షేర్ చేశారు ఆనంద్ మహీంద్ర.
మన దేశంలో ఒలింపిక్స్ వరకు వెళ్లిన ఆటగాళ్లు మాత్రమే కాకుండా ట్రైనింగ్ కూడా లేకుండా మిగిలిపోయిన వారు కూడా ఉన్నారు. సరైన ప్రోత్సాహం అందక, ట్రైనింగ్‌కు వీలు లేక చాలామంది టాలెంట్ ఎవ్వరికీ తెలీకుండా పోతుంది. అందులో ఒకరి వీడియోనే షేర్ చేశాడు ఆనంద్ మహీంద్ర. ఈ వీడియోలో ఓ ధోబీ మలుపులు తిరిగిన రోడ్డులో సైకిల్ తొక్కిన తీరు అందరినీ ఆకర్షిస్తోంది.
'ఈ వ్యక్తి బాడీలో జైరోస్కోప్‌తో పుట్టిన మానవ సెగ్వేలాగా ఉన్నాడు. అతడి బ్యాలెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి వారు మన దేశంలో ఎంతోమంది ఉన్నా.. వారికి క్రీడాకారులు అయ్యే టాలెంట్ ఉన్నా వారికి ట్రైనింగ్, గుర్తింపు అందట్లేదు అన్న విషయమే నన్ను ఎక్కువగా బాధిస్తుంది' అంటూ ఆ ధోబీ వీడియోను షేర్ చేశారు ఆనంద్ మహీంద్ర. ఇలాంటి వారికి అవకాశాలు కల్పించి, ప్రోత్సహిస్తే మంచి క్రీడాకారులుగా ఎదుగుతారు.. క్రీడల్లో రాణిస్తారు. దేశానికి పతకాలు అందిస్తారు అని మహీంద్రా ట్వీట్ చేశారు.
This man is a human Segway, with a built in gyroscope in his body! Incredible sense of balance. What pains me, however, is that there are so many like him in our country who could be talented gymnasts/sportspersons but simply don't get spotted or trained… pic.twitter.com/8p1mrQ6ubG
— anand mahindra (@anandmahindra) March 29, 2022