Audi cars : ఆడి కారు ధర మరింత ప్రియం.. సెప్టెంబర్ 20 నుంచి..
Audi cars : జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి మంగళవారం తన మొత్తం మోడల్ శ్రేణి ధరలను వచ్చే నెలలో 2.4 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది.;
Audi Car: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి మంగళవారం తన మొత్తం మోడల్ శ్రేణి ధరలను వచ్చే నెలలో 2.4 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఇన్‌పుట్ మరియు సప్లై చైన్ ఖర్చులు పెరగడం వల్ల ధరల పెంపు జరిగింది అని పెంచిన ఈ ధరలు సెప్టెంబర్ 20, 2022 నుండి అమల్లోకి వస్తాయని వాహన తయారీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆడి ఇండియా పెట్రోల్ మోడల్స్ A4, A6, A8 L, Q5, Q7, Q8, S5 స్పోర్ట్‌బ్యాక్, RS 5 స్పోర్ట్‌బ్యాక్ మరియు RS Q8లను విక్రయిస్తోంది. ఇ-ట్రాన్ బ్రాండ్ క్రింద ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్‌ఫోలియోలో ఇ-ట్రాన్ 50, ఇ-ట్రాన్ 55, ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఇ-ట్రాన్ జిటి మరియు ఆర్ఎస్ ఇ-ట్రాన్ జిటి ఉన్నాయి. కంపెనీ ఇటీవల భారతదేశంలో Q3 కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది.