Bajaj : బజాజ్ ట్రయంఫ్ నయా మోడల్స్ లాంచ్

Update: 2024-09-18 08:15 GMT

ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో మరో రెండు కొత్త బైక్ లను భారత మార్కెట్​ లోకి లాంచ్‌ చేసింది. బ్రిటీష్‌ మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ ట్రయంఫ్‌తో కలిసి గతేడాది ట్రయంఫ్‌ స్పీడ్‌ 400, స్క్రాంబ్లర్‌ 400X బైక్‌లను లాంచ్‌ చేసిన బజాజ్‌.. తాజాగా మరో రెండు బైక్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ట్రయంఫ్‌ స్పీడ్‌ టీ4, స్పీడ్‌ 400 MY25 పేరుతో వీటిని విడుదల చేసింది. స్పీడ్‌ టీ4 ధర రూ.2.17 లక్షలు (ఎక్స్‌- షోరూమ్‌), స్పీడ్‌ 400 ఎంవై25 ధర రూ.2.40 లక్షలు (ఎక్స్‌- షోరూమ్‌)గా కంపెనీ నిర్ణయించింది. ట్రయంఫ్‌ స్పీడ్‌ టీ4ను 400cc ఇంజిన్‌తో తీసుకొచ్చారు. లిక్విడ్‌ కూల్డ్‌, సింగిల్‌ సిలిండర్‌ యూనిట్‌ కలిగి ఉంటుంది. ఇది 7000 ఆర్‌పీఎం వద్ద 30.6 బీహెచ్‌పీ పవర్‌ను, 5000 ఆర్‌పీఎం వద్ద 36ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గతేడాది తీసుకొచ్చిన స్పీడ్‌ 400 కంటే దీని ఇంధన సామర్థ్యం 10 శాతం అధికం అని కంపెనీ చెబుతోంది. ఈ బైక్‌ టాప్‌స్పీడ్‌ 135 కిలోమీటర్లు. 6 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌తో వస్తోంది. ఎల్‌ఈడీ లైటింగ్‌ సిస్టమ్‌, డిజిటల్‌ డిస్‌ప్లే, బ్లూటూత్‌ కనెక్టివిటీ, ట్రాక్షన్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. మూడు కలర్స్ లో లభించనుంది. స్పీడ్‌ 400లో ఎంవై25 బైక్‌ 398సీసీ ఇంజిన్‌తో తీసుకొచ్చారు. ఇది లిక్విడ్‌ కూల్డ్‌, సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌. 8000 ఆర్‌పీఎం వద్ద 39 బీహెచ్‌పీ పవర్‌ను, 6,500 ఆర్‌పీఎం వద్ద 37.5 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నాలుగు కలర్స్ లో లభిస్తుంది. వెట్‌ స్లిపర్‌ క్లచ్‌ సిస్టమ్‌తో కూడిన 6 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌ ఉంటుంది. డ్యూయల్‌ ఏబీఎస్‌ ఉంది.

Tags:    

Similar News