Fuel Credit Cards: ఈ కార్డులు మీ వద్ద ఉంటే పెట్రో ఖర్చు ఆదా..
Fuel Credit Cards: బయటకు వెళ్లాలంటే, బండో కారో తీయాల్సిందే.. కానీ అందులో పెట్రోల్ కొట్టించాలంటే.. వామ్మో జేబుకు చిల్లే..;
Fuel Credit Cards: బయటకు వెళ్లాలంటే, బండో కారో తీయాల్సిందే.. కానీ అందులో పెట్రోల్ కొట్టించాలంటే.. వామ్మో జేబుకు చిల్లే.. దానికంటే ఇంట్లో కూర్చోవడం బెటరేమో అని అనుకునేవాళ్లే చాలా మంది ఉంటున్నారు పెరిగిన పెట్రోల్ ధరలు చూసి. సొంత వాహనం ఉంటే సుఖమే కాని, పెరిగిన పెట్రోల్ ధరలు భయపెడుతున్నాయి.
అయితే మీ దగ్గర బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఉంటే ఇంధన సర్ ఛార్జీల్లో కొంత మినహాయింపు ఉంటుంది. కొన్ని బ్యాంకులు కష్టమర్ల ప్రయోజనార్థం ఇంధన ఆధారిత క్రెడిట్ కార్డులు అందిస్తున్నాయి. వీటి ద్వారా మీరు మీ బండిలో పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు ధర కొంత తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా మీ ప్రయాణ ఖర్చుని తగ్గించుకోవడమే కాకుండా ఎక్కువ సౌకర్యాన్ని కూడా పొందొచ్చు.
బీపీసీఎల్ క్రెడిట్ కార్డు ఉంటే..
ఈ కార్డు మీ దగ్గర ఉంటే పెట్రోల్ బంకుల్లో ప్రతి నెలా రూ.100 వరకు సర్‌చార్జి రద్దవుతుంది.
ప్లాన్ ప్రకారం వాడితే ఏటా 70 లీటర్ల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.
డైనింగ్, నిత్యావసరాలు, సినిమా టికెట్లు, డిపార్ట్‌మెంట్ స్టోర్లలో చేసే ప్రతి రూ.100 ఖర్చుపై 5 రివార్డు పాయింట్లు లభిస్తాయి.
ఇంధనేతర వస్తువులపై చేసే ప్రతి రూ.100 ఖర్చులపై 1 రివార్డు పాయింట్.
కార్డు పొందేందుకు చెల్లించాల్సిన మొత్తం రూ.499
కార్డు తీసుకున్నాక తొలిసారి లభించే ప్రయోజనాలు.. రూ.500 విలువ చేసే 2,000 పాయింట్లు.
హెచ్‌డీఎఫ్‌సి భారత క్రెడిట్ కార్డు ఉంటే..
నిత్యావసరాలు ఇతర బిల్లు చెల్లింపులపై 5 శాతం క్యాష్ బ్యాక్.
పెట్రోల్ పంపుల్లో కనీసం రూ.400 లావాదేవీ జరిపితే 1 శాతం సర్ చార్జి రద్దు. గరిష్టంగా రూ.250 వరకు ప్రయోజనం
కార్డు పొందేందుకు చెల్లించాల్సిన మొత్తం రూ.500
రూ.50 లక్షల వరకు ప్రమాద బీమా
ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్
ప్రతి రూ.100 లావాదేవికి 20 రివార్డు పాయింట్లు.. ప్రతినెలా కనీసం రూ.100 ఖర్చు చేయాల్సి ఉంటుంది.
బ్యాంక్ భాగస్వామ్య రెస్టారెంట్లలో చేసే డైనింగ్ బిల్లుపై 20 శాతం రాయితీ
సినిమా టికెట్లలో రాయితీ
కార్డు పొందేందుకు రూ.500 చెల్లించాలి.
బీపీసీఎల్ కార్డు
బీపీసీఎల్ పెట్రోల్ పంపుల్లో చేసే ప్రతి రూ.100 వ్యయంపై 25 రివార్డు పాయింట్లు లభిస్తాయి.
సినిమా టికెట్లు, నిత్యావసరాల కోసం చేసే ప్రతి రూ.100 వ్యయంపై 10 రివార్డు వస్తాయి.
కార్డు పొందేందుకు చెల్లించాల్సిన మొత్తం రూ.1,499
ఇండియన్ ఆయిల్ సిటీ బ్యాంక్ ప్లాటినం
ఇంధన లావాదేవీలపై 1శాతం సర్‌ఛార్జి రద్దు
నిత్యావసరాలు, సూపర్ మార్కెట్లలో చేసే ప్రతి రూ.150 ఖర్చుపై 2 టర్బో పాయింట్లు లభిస్తాయి.