BIGBASKET: 10 నిమిషాల్లో ఆహారం డెలివరీకు బిగ్‌బాస్కెట్ సిద్ధం!
ఫుడ్ డెలివరీ రంగంలోకి బిగ్ బాస్కెస్.. బెంగళూరులో తొలి ప్రయోగం;
ప్రముఖ ఈ-గ్రాసరీ ప్లాట్‌ఫాం బిగ్‌బాస్కెట్ త్వరలో "10 నిమిషాల్లో ఆహార డెలివరీ" సేవలను ప్రారంభించనుంది. టాటా గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ, దేశవ్యాప్తంగా ఈ సేవలను 2025-26 ఆర్థిక సంవత్సరం చివరికి అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. ఈ కొత్త సేవలతో బిగ్‌బాస్కెట్, ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్విగ్గీ స్నాక్, బ్లింకిట్ బిస్ట్రో, జెప్టో కేఫ్ వంటి సంస్థలతో పోటీకి దిగనుంది. ప్రస్తుతం ఈ సంస్థలు 10-15 నిమిషాల్లో వేడి కాఫీ, రెడీ టు ఈట్ స్నాక్స్‌ను వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. బిగ్‌బాస్కెట్ సహ వ్యవస్థాపకుడు విపుల్ పరేఖ్ మాట్లాడుతూ, తమ లక్ష్యం ప్రస్తుతం ఉన్న ఆహార డెలివరీ యాప్స్ వినియోగదారులను ఆకర్షించడమే కాక, కొత్త కస్టమర్లను కూడ చేర్చుకోవడమేనన్నారు. ఇందులో భాగంగా, నగరాల్లోని చిన్న గోదాములు (డార్క్ స్టోర్లు) ఆధారంగా వేగవంతమైన డెలివరీలు చేయాలని సంస్థ యోచిస్తోంది.
ప్రయోగం బెంగళూరులో మొదలు
ఇప్పటికే బెంగళూరులో బిగ్‌బాస్కెట్ ప్రయోగాత్మకంగా ఆహార డెలివరీ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం టాటా గ్రూప్‌కు చెందిన స్టార్బక్స్ కాఫీ మరియు ఇండియన్ హోటల్స్ సంస్థల ఆహార విభాగమైన క్యూమిన్ నుంచి మాత్రమే డెలివరీలు జరుగుతున్నాయి. పరేఖ్ మాట్లాడుతూ, వచ్చే 18 నుంచి 24 నెలల మధ్య బిగ్‌బాస్కెట్ ఐపీఓకు సన్నద్ధమవుతోందని తెలిపారు. కంపెనీ వ్యాప్తిని పెంచడంలో ఇది కీలక అడుగవుతుందని చెప్పారు. **ఓలా, ఉబెర్‌కు పోటీగా బైక్, క్యాబ్ సర్వీసులందిస్తోన్న ర్యాపిడో కూడా స్విగ్గీ, జొమాటోకు సవాలు విసురుతోంది.