UPI : యూపీఐ ట్రాన్సాక్షన్లకు బయోమెట్రిక్ అథెంటికేషన్..నవి యాప్‌లో సరికొత్త ఫీచర్.

Update: 2025-10-10 05:15 GMT

UPI : డిజిటల్ పేమెంట్స్ ప్రపంచంలో యూపీఐ అత్యంత వేగవంతమైన, సురక్షితమైన పద్ధతిగా మారింది. అయితే, ప్రతిసారీ పిన్ ఎంటర్ చేయడంలో ఉండే ఇబ్బందిని తొలగించడానికి, బెంగళూరుకు చెందిన నవి యూపీఐ సంస్థ ఒక విప్లవాత్మక ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే బయోమెట్రిక్ అథెంటికేషన్. ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకొచ్చిన మొట్టమొదటి యూపీఐ యాప్‌గా నవి నిలిచింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూపీఐ లావాదేవీలు మరింత సులభంగా, వేగంగా, సురక్షితంగా మారనున్నాయి.

పిన్ అవసరం లేదు  నవి యాప్ పరిచయం చేసిన ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఇకపై ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పిన్ నంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. బదులుగా, ఫోన్‌లో అందుబాటులో ఉన్న వేలిముద్ర లేదా ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ను ఉపయోగించి లావాదేవీని క్షణాల్లో అథెంటికేషన్ అవకాశం లభిస్తుంది. ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ కార్యక్రమంలో నవి ఈ కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. నవి మాత్రమే కాదు, త్వరలో ఫోన్‌పే, పేటీఎం వంటి ఇతర ప్రముఖ యూపీఐ యాప్‌లు కూడా ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

సులభం, వేగం, సురక్షితం  నవి యాప్‌లోని ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్ పూర్తిగా సురక్షితమైన, సొంత ఆపరేటింగ్ సిస్టమ్ టెక్నాలజీతో రూపొందించబడింది. దీనివల్ల యూపీఐ పేమెంట్స్ చాలా వేగంగా పూర్తవుతాయి. ముఖ్యంగా, ఈ అథెంటికేషన్ ప్రక్రియ మొత్తం ఫోన్ సురక్షిత వాతావరణంలోనే జరుగుతుంది. కాబట్టి, యూజర్ల వ్యక్తిగత డేటా బయటకు వెళ్లే ప్రమాదం ఉండదు. ఈ విధంగా లావాదేవీలు చాలా సురక్షితంగా ఉంటాయని కంపెనీ పేర్కొంది.

నవి యాప్‌లో ఈ బయోమెట్రిక్ ఫీచర్ వాడుక యూజర్ ఇష్టం. యూజర్లు తమకు నచ్చినప్పుడు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ ఫీచర్‌తో పాటు, పాత పద్ధతిలో పిన్ నంబర్ ఎంటర్ చేసే ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది. యూజర్లు రెండింటిలో దేన్నైనా ఎంచుకుని తమ ట్రాన్సాక్షన్లను పూర్తి చేయవచ్చు.

నవి యాప్ రిజిస్ట్రేషన్ కూడా సులభతరం  కొత్త ఫీచర్‌తో పాటు, నవి యాప్ కొత్త యూజర్ల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా చాలా సులభతరం చేసింది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, నమోదు చేసుకోవడం, మొదటి ట్రాన్సాక్షన్ పూర్తి చేయడం వంటి పనులను తక్కువ సమయంలో వేగంగా అయ్యేలా చర్యలు తీసుకున్నారు.

Tags:    

Similar News