Nissan Magnite : మధ్యతరగతి ప్రజలకి పండగే..రూ.6.21 లక్షలకే 5 స్టార్ సేఫ్టీ లగ్జరీ ఎస్‌యూవీ సొంతం.
Nissan Magnite : పట్టణాల్లో ట్రాఫిక్ రోజురోజుకూ నరకంగా మారుతోంది. గంటల తరబడి సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేయడం, మాటిమాటికీ క్లచ్ నొక్కడం, గేర్లు మార్చడం డ్రైవర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే ఇప్పుడు అందరూ ఆటోమేటిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లు ఉన్న ఎస్‌యూవీ దొరకడం కష్టమే అనుకుంటాం. కానీ నిస్సాన్ ఇండియా ఒక అదిరిపోయే ఆప్షన్‌ను మన ముందుకు తెచ్చింది. కేవలం రూ.6.21 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతోనే నిస్సాన్ మాగ్నైట్ ఆటోమేటిక్ వేరియంట్‌ను అందిస్తూ మధ్యతరగతి ప్రజల కలలను నిజం చేస్తోంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభించే అత్యంత చౌకైన ఆటోమేటిక్ ఎస్‌యూవీగా నిలిచింది.
నిస్సాన్ మాగ్నైట్ విశియా ఏఎంటీ వేరియంట్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని ఇవ్వడానికి ఈ ఏఎంటీ టెక్నాలజీ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇది టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ మరియు టాటా నెక్సాన్ వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీనిస్తోంది. కేవలం ధర మాత్రమే కాదు, మైలేజీ విషయంలో కూడా మాగ్నైట్ తగ్గేదేలే అంటోంది. ఒక లీటర్ పెట్రోల్‌కు సుమారు 19.7 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని సంస్థ పేర్కొంది. అంటే అటు జేబుకు చిల్లు పడదు, ఇటు కంఫర్ట్‌కు లోటు ఉండదు.
ఈ కారులో ఉన్న అత్యంత కీలకమైన విషయం దాని సేఫ్టీ రేటింగ్. గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టింగ్‌లో ఈ ఎస్‌యూవీ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ముఖ్యంగా ఇందులోని 6 ఎయిర్‌బ్యాగ్స్ వేరియంట్ ప్రయాణికులకు అత్యంత పటిష్టమైన సేఫ్టీని ఇస్తుంది. సాధారణంగా బడ్జెట్ కార్లలో టాప్ వేరియంట్లలో మాత్రమే ఎయిర్‌బ్యాగ్స్ ఎక్కువగా ఇస్తారు. కానీ, నిస్సాన్ మాగ్నైట్ తన అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ సదుపాయాన్ని కల్పిస్తూ సేఫ్టీ విషయంలో రాజీ పడలేదని నిరూపించుకుంది. ఇది సామాన్యులకు ఒక పెద్ద ఊరటనిచ్చే అంశం.
ఫీచర్ల విషయానికి వస్తే.. నిస్సాన్ మాగ్నైట్ లో 360 డిగ్రీ అరౌండ్ వ్యూ మానిటర్ ఉంటుంది. దీనివల్ల ఇరుకైన సందుల్లో కూడా కారును పార్క్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎల్-షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్, యాంబియంట్ లైటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఈ కారుకు లగ్జరీ లుక్‌ను ఇస్తాయి. లగేజీ కోసం 336 లీటర్ల బూట్ స్పేస్ ఉండగా, వెనుక సీట్లను ఫోల్డ్ చేస్తే అది ఏకంగా 690 లీటర్ల వరకు పెరుగుతుంది. అంతేకాకుండా, 10 లీటర్ల కూల్డ్ గ్లోవ్ బాక్స్‌లో కూల్ డ్రింక్స్ లేదా వాటర్ బాటిల్స్ చల్లగా ఉంచుకోవచ్చు.
ప్రస్తుతం ఈ కారును కొనాలనుకునే వారికి కంపెనీ మరిన్ని ఆఫర్లను కూడా ప్రకటించింది. పాత కారును ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.55,000 వరకు బెనిఫిట్స్, అలాగే కార్పొరేట్ ఉద్యోగులకు మరో రూ.5,000 అదనపు తగ్గింపు లభిస్తోంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, అదిరిపోయే లుక్స్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తున్న ఈ కారు.. బడ్జెట్‌లో ఎస్‌యూవీ కొనాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశం. తక్కువ ధరలో ఎక్కువ భద్రత కోరుకునే ఫ్యామిలీస్ కోసం నిస్సాన్ మాగ్నైట్ ఒక పక్కా ఆప్షన్ అని చెప్పవచ్చు.