Citroen C3 Aircross: పర్ఫామెన్స్‌ పై ఫుల్‌ రివ్యూ

సిట్రోయెన్‌ సీ3 ఎయిర్‌క్రాస్‌ ఫీచర్లు, ఇంజిన్‌ పర్ఫామెన్స్‌;

Update: 2023-08-07 09:15 GMT

ఇండియాలో ఇప్పుడు ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ నడుస్తోంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు పోటీపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా మార్కెట్‌లో సిట్రోయెన్‌ సీ3 ఆకర్షణీయమైన మోడల్స్‌, ఫీచర్లతో రంగంలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఆ కార్ గురించి ఓ లుక్ వేద్దాం. ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ఇటీవల C3 ఎయిర్‌క్రాస్ SUVని లాంచ్ చేసింది. ఇది ఆ కంపెనీ నుంచి వస్తున్న నాల్గవ మోడల్. సిట్రోయెన్ ఈ మోడల్‌ను త్వరలో దేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. దీని ఫ్రంట్‌ డిజైన్ రెగ్యులర్‌ C3 తో పోలిస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సీ3 ఎయిర్‌ క్రాస్‌లో పెద్ద గ్రిల్‌ బంపర్‌ హౌసింగ్‌ యొక్క రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ విభాగం ద్వారా విడిపోయి ఉంటుంది. దిగువన సిల్వర్ ఫాక్స్‌ బాష్‌ ప్లేట్‌ మరియు సర్కిల్‌ ఆకారంలో ఫాగ్‌ ల్యాంప్‌లు ఉంటాయి. ఈ ఎస్‌యూవీ 200mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ను ఇస్తుంది.


అలాగే వెనుక భాగంలో ఆకట్టుకునే డిజైన్‌ను ఉంది. వీటిలో 3-D C ఆకారంలో టైల్‌లైట్‌లు చాలా అందంగా అమర్చబడి ఉన్నాయి.ఇక వెనుకవైపు విండ్‌ స్క్రీన్‌, బ్లాక్‌ ప్లాస్టిక్‌ స్ట్రిప్స్‌తో ఆకర్షణీయమైన లుక్‌ను కలిగి ఉంది. ఇక సీ3 ఎయిర్‌ క్రాస్‌లో దాని ఫ్రంట్‌ సీట్లను పరిశీలిస్తే.. సీ3 హ్యాచ్‌బ్యాక్‌ వంటి డిజైన్‌లోనే ఉంటుంది. 10.2 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ టచ్‌స్క్రీన్‌ను సీ3 హ్యాచ్‌ నుంచి తీసుకున్నారు. అయితే 7 అంగుళాల డ్రైవర్‌ డిస్‌ప్లేను మాత్రం కొత్తగా ఉంది. టచ్‌స్క్రీన్‌ యూనిట్‌తో ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే కనెక్టవిటీతో మీరు డిస్టర్బెన్స్‌ లేని మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.

అలాగే ఇందులో ముందు సీట్లను సౌకర్యవంతంగా తయారుచేశారు. ఇది ముందు కూర్చున్న డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు కూర్చునేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. కాగా మిడిల్‌ మరియు వెనుక సీట్లలో కుషనింగ్‌ అనుకున్న స్థాయిలో ఉండదు. 5+2 సీటర్‌ వేరియంట్‌లో చివరి వరుసలోని సీట్లు పిల్లలకు, పెద్దల కోసం కేటాయించారు.ఇందులో బూట్‌ స్పేస్‌ విశాలంగా ఉంటుంది. ట్రిప్‌కు వెళ్లాలి అనుకునేవారు చాలా పెద్ద మొత్తంలో సామగ్రి పెట్టుకోవచ్చు. అయితే 5+2 సీటర్‌ వేరియంట్‌లో బూట్ స్పేస్‌ కొద్దిగా తగ్గుతుంది. కానీ ఐదుగురు మాత్రమే వెళ్లాలి అనుకున్నప్పుడు వెనుక ఉన్న రెండు సీట్లను మడతపెట్టి బూట్‌ స్పేస్‌ను ఉపయోగించుకోవచ్చు.


సీ3 ఎయిర్‌క్రాస్‌ ఫీచర్లన్నీ డ్రైవింగ్‌ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఆధునిక సాంకేతికతతో వాహనదారుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని సిట్రోయెన్‌ ఈ కారులో అధునాతన ఫీచర్లను ప్రవేశపెట్టింది. భద్రత కోసం, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్-వ్యూ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్ర్లు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కొత్త Citroën C3  ధర మాత్రం వెల్లడి కాలేదు.

Tags:    

Similar News