Share Market: క్లోజింగ్ బెల్ : మార్కెట్ మటాష్, చివర్లో కోలుకున్నప్పటికీ భారీ నష్టాలతోనే ముగింపు
Share Market: ఒమిక్రాన్ పెనుముప్పుగా మారనుందనే భయాందోళనలతో పాటు పలు దేశాల ఆర్థిక పునరుద్ధరణకు ఆటంకం ఎదురుకానుందనే వార్తలు ప్రపంచ మార్కెట్లన్నింటీని ఒక్కసారిగా కుదిపేశాయి.;
Share Market: - మార్కెట్ మటాష్, చివర్లో కోలుకున్నప్పటికీ భారీ నష్టాలతోనే ముగింపు
- స్టాక్ మార్కెట్లో రక్తటేరు, గత 8 నెలల్లో ఇది రెండో అత్యంత చెత్తప్రదర్శన
- సెన్సెక్స్ 1190, నిఫ్టీ 371 పాయింట్ల నష్టం
- హెవీ వెయిట్‌తో పాటు కుదేలైన స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లు
- 7 కమోడిటీల ట్రేడింగ్‌ను ఏడాది పాటు నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు
- ద్రవ్యోల్బణం పెరగడం, ఓమిక్రాన్ విజృంభణతో బలహీనపడిన సెంటిమెంట్
- పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగిస్తోన్న ఎఫ్‌ఐఐలురాబోయే రోజుల్లో ఒమిక్రాన్ పెనుముప్పుగా మారనుందనే భయాందోళనలతో పాటు పలు దేశాల ఆర్థిక పునరుద్ధరణకు ఆటంకం ఎదురుకానుందనే వార్తలు ప్రపంచ మార్కెట్లన్నింటీని ఒక్కసారిగా కుదిపేశాయి. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 18వందల 80పాయింట్లు, నిఫ్టీ 575 పాయింట్లు నష్టపోయాయి. అయితే మిడ్‌సెషన్ తర్వాత మార్కెట్లు కోలుకున్నప్పటికీ నష్టాల ఊబి నుంచి మాత్రం బయటపడలేకపోయాయి. దీంతో ట్రేడింగ్ మొత్తం మీద సెన్సెక్స్ 11 వందల 90 పాయింట్ల నష్టంతో 55 వేల 822 వద్ద, నిఫ్టీ 371 పాయింట్ల నష్టంతో 16 వేల 614 వద్ద ఇవాళ్టి ట్రేడింగ్‌ను ముగించాయి.
గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్ లేకపోవడం, ద్రవ్యోల్బణ భయాలు, ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో పాటు వరి, గోధుమ, శనగలు, ఆవాలు, సోయాబీన్స్, ముడి పామాయిల్, పెసర్ల కమోడిటీ ట్రేడింగ్‌ను ఏడాది పాటు నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడం మన మార్కెట్ల సెంటిమెంట్‌పై ఇవాళ ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీంతోపాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకోవడం కూడా మన సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లోని అన్ని రంగాల సూచీలు ఇవాళ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
బ్యాంకింగ్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు ఇవాళ్టి నష్టాలను లీడ్ చేశాయి. దీంతోపాటు బోర్డర్ ఇండిసెస్ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కూడా భారీ కరెక్షన్‌కు లోనయ్యాయి. హెవీ వెయిట్ స్టాక్స్‌తో పాటు స్మాల్, మీడియం స్టాక్స్ అన్నీ భారీగా నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా నిలిచాయి. సిప్లా 3.91శాతం, హెచ్‌యూఎల్ 1.74, డాక్టర్ రెడ్డీస్ 0.95శాతం లాభంతో నిఫ్టీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. బీపీసీఎల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐలు 4 శాతం నుంచి 6.50శాతం నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.